మెగాస్టార్ చిరంజీవిని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలామంది మోసం చేశారని, అవకాశాలు ఇస్తామని చెప్పి పిలిపించుకొని మరీ అవమానించారంటూ ఇలా ఎన్నో వార్తలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిరంజీవికి ఓ ప్రముఖ నిర్మాత అవకాశం ఇస్తానని చెప్పి అవమానించారట. మరి ఇంతకీ ఆయన ఎవరు.. ఎందుకు చిరంజీవిని వాడుకొని వదిలేసారు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి తెలుగు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రల్లో కూడా నటించారు. అలా కృష్ణ, జయప్రద కాంబోలో కొత్త అల్లుడు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నటించారు. అయితే ఇందులో నటించమని సత్యచిత్ర నిర్మాణ సంస్థలో ఒకరైన సూర్యనారాయణ చెప్పారట.

అయితే ఈ సినిమా విడుదలయ్యాక నీకోసం ఓ సినిమా చేస్తాను నువ్వే హీరో అని చిరంజీవికి ఆశ కల్పించారట. అయితే అప్పుడే ఇండస్ట్రీకి చిరంజీవి కొత్తగా వచ్చారు.అందులోనూ ప్రముఖ నిర్మాత అడగడంతో కాదన లేకపోయారట.అలా కొత్త అల్లుడు సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఈ మూవీ హిట్ అయింది. ఆ తర్వాత చిరంజీవి నిర్మాత సూర్యనారాయణ తనతో కొత్త సినిమా అనౌన్స్ చేస్తారని ఎక్జైటింగ్ గా ఉన్నారు.కానీ అప్పుడే కృష్ణ జయప్రద కాంబోలో మరో సినిమా అనౌన్స్ చేశారు సూర్యనారాయణ. దాంతో ఎంతో బాధతో చిరంజీవి నిర్మాత దగ్గరికి వెళ్లి నెక్స్ట్ నాతో సినిమా చేస్తానన్నారు కదా అని అడగగా.. ఈ సినిమా చేయాల్సి వస్తుంది. వచ్చే ఏడాది కచ్చితంగా నీతో సినిమా చేస్తా అని నమ్మబలికారట. అయినా కానీ చిరంజీవి సైలెంట్ అయ్యారట. ఆ తర్వాత అదే నిర్మాత కొత్తపేట రౌడీ మూవీలో చిరంజీవిని గెస్ట్ రోల్ లో చేయమని చెప్పారట.

కానీ అప్పటికే చిరంజీవి రెండు సినిమాల్లో హీరోగా చేస్తున్నారు. ఆ హీరోగా చేసే రెండు సినిమాల దర్శక నిర్మాతలు వేరే సినిమాల్లో గెస్ట్ రోల్ చేస్తే ఈ సినిమాలకు మార్కెట్ ఉండదు అని చెప్పినా కూడా వినకుండా ప్రముఖ నిర్మాత సూర్యనారాయణ మాట కాదనలేక మొహమాటానికి పోయి అందులో కూడా గెస్ట్ రోల్ చేశారట. ఆ తర్వాత కూడా ఆ నిర్మాత మాట మీద ఉండి చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా తీయలేదట. అలా రెండుసార్లు చిరంజీవితో నమ్మబలికి హీరో అవకాశం ఇస్తానని చెప్పి విలన్ పాత్రలో, గెస్ట్ రోల్ లో చేయించారట. ఇలా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎంతోమంది చిరంజీవిని ఇలాగే వాడుకొని మోసం చేసి వదిలేసారట. అయినా కూడా ఎవరికి ఈ విషయం చెప్పకుండా మౌనమే వహించారట. ఇక ఆరోజు ఆయన చూపించిన సహనమే ప్రస్తుతం ఆయన్ని ఇండస్ట్రీలో మెగాస్టార్ గా చేసింది అంటారు ఆయన సన్నిహితులు అభిమానులు

మరింత సమాచారం తెలుసుకోండి: