సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే తెలుగు అమ్మాయిల హవ కొంతమేరకు కనిపిస్తూ ఉన్నది.అలా మెప్పిస్తున్న వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు. మొదట షార్ట్ ఫిలిమ్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ యూట్యూబ్లో వీడియోలతో బాగానే పాపులర్ కి సంపాదించుకుంది. అలా స్టార్ హీరోల చిత్రాలు చిన్న చిన్న పాత్రలలో నటించి బేబీ సినిమాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వైష్ణవి చైతన్య తెలుగులో ఎన్నో అవకాశాలను సంపాదించుకుంది.


ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో జాక్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నది. ఈ చిత్రంలో నుంచి ఇటీవలే కిస్ అనే సాంగ్ కూడా విడుదల కాగా చిత్ర బృందం ఇటీవలే ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో ప్రముఖ నిర్మాత SKN తో విభేదాలపై మాట్లాడడం జరిగింది వైష్ణవి చైతన్య. ఇటీవలే SKN ఒక  సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో తనకి బాగా తెలుసని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు అన్ని కూడా వైష్ణవి చైతన్యాన్ని ఉద్దేశించి అన్నారు అన్నట్లుగా చాలామంది వైరల్ చేశారు. ఈ వివాదం పైన SKN క్లారిటీ ఇచ్చిన ఈ న్యూస్ మాత్రం ఆగలేదు.


అయితే ఇలాంటి సమయంలోనే వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. తనకు SKN తో ఏమి ఇబ్బంది లేదని ఆయనతో నాకు ఎలాంటి సమస్యలు కూడా లేవని తెలియజేసింది. ఆయన చేసిన కామెంట్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది. ఆయన మాట్లాడిన వీడియోలో తన పేరు మెన్షన్ చేయనప్పుడు తాను ఎందుకు స్పందిస్తానంటు తెలియజేసింది వైష్ణవి చైతన్య.. అంతేకాకుండా SKN బ్యానర్ లో సినిమా చేయవలసి ఉండగా అది ఆగిపోయినడం వల్లే ఆయన అలా మాట్లాడారని విషయం పైన స్పందిస్తూ.. బేబీ టీమ్ తో తాను చేయవలసిన సినిమా కొన్ని కారణాల చేతనే ఆగిపోయిందని మళ్లీ అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తానంటూ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: