
ఆ రోజుల్లోనే థియేటర్లలో ఈ సినిమా మంచిగా ఆడింది. ఈ మూవీ మంచి టాక్ ని కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని పాత్రలకు నాని, మాళవిక, విజయ్ దేవరకొండ ప్రాణం పొసరనే చెప్పాలి. వీరి నటన మాత్రం చాలా అద్బుతంగా ఉంటుంది. ఈ సినిమాలో నాని సుబ్రమణ్యం పాత్ర పోషించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో నాని తనని తాను అన్వేషించుకోవడానికి చేసిన ఓ ప్రయణమే ఈ సినిమా. ఈ సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు.
అయితే ఈ సూపర్ సినిమా వచ్చి పదేళ్ల అవుతుంది. ఈ సినిమా మరోసారి నేడు థియేటర్ లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా రీరిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడ అంటూ ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఎవడే సుబ్రమణ్యం సినిమాలోని సుబ్బు, రిషి పాత్రలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికే నాని, విజయ్ ల ఫ్యాన్ వార్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకు మరోసారి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. మళ్లీ ఎవడే సుబ్రమణ్యం సినిమా అందరి హృదయాలలో నిలిచిపోతుంది. ఇక ఎవడే సుబ్రమణ్యం నేడు ఎంత కలెక్షన్ సంపాదిస్తుందో చూడాలి.