టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందరూ టాలీవుడ్  స్టార్ నటి సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది తెలుగు చిత్ర పరిశ్రమకు ఏమాయ చేసావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న సమంత వరుసగా తెలుగులో సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఈ చిన్నది టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. 


ఇక రీసెంట్ గా  టాలీవుడ్  స్టార్ నటి  సమంత నటించిన హనీ బన్నీ వెబ్ సిరీస్ బాలీవుడ్ లో ప్రేక్షకు లను ఆక ట్టుకుంది. ఇందు లో వరుణ్ ధావన్ తో కలిసి ఈ చిన్నది నటించిన రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసాయి. ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా....టాలీవుడ్  స్టార్ నటి  సమంత  పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు విపరీతం గా క్రేజ్ వచ్చింది. ఈ పాటతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా సమంత పేరు మార్మోగిపోయిందని చెప్పవచ్చు. 


ఇక ఈ చిన్నది మరోసారి ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి. అయితే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలోనే పుష్ప-3 సినిమా రాబోతోంది. అయితే ఈ సినిమాలోనే సమంత ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధమవుతుందన్నట్లుగా వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ మరోసారి అల్లు అర్జున్ సరసన ఈ చిన్నది స్టెప్పులు వేసినట్లయితే సినిమాకే ప్లస్ పాయింట్ అవుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారట. మరి సమంత ఏ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధమైంది అనే విషయాలు తెలియాల్సి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: