అక్కినేని హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన తండ్రి అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన నటనతో కూడా ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ నాగచైతన్య కెరీర్ లో పెద్దగా సక్సెస్ అయిన సినిమాలు లేవు. రీసెంట్ గా నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత కలెక్షన్లు సాధించిన సినిమాగా తండేల్ చిత్రం నిలవడం విశేషం. 



సినిమా అనంతరం నాగచైతన్య తన తదుపరి సినిమా షూటింగ్ కి సిద్ధమవుతున్నారని సమాచారం అందుతోంది. నాగచైతన్య నటి శోభిత దూలిపాలను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం నుంచి వారి చాలా సీక్రెట్ గా వారి రిలేషన్ కొనసాగించిన ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. వివాహ తర్వాత నాగచైతన్య, శోభిత ఇద్దరు కలిసి వారి వైవాహిక జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా కొనసాగిస్తున్నారు.


 వివాహం జరిగినప్పటి నుంచి శోభిత ఇప్పటివరకు సినిమాలలో నటించకపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇక నాగచైతన్య మాత్రం తన సినిమా షూటింగ్లలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.... ఈ జంట రీసెంట్ గానే వారి హనీమూన్ ట్రిప్ కి వెళ్ళిన విషయం తెలిసిందే. హనీమూన్ లో ఈ జంట ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అంతేకాకుండా ఈ జంట త్వరలోనే పిల్లలను కణాలని కూడా డిసైడ్ అయ్యారట. ఇదిలా ఉండగా.... నాగచైతన్య తన భార్య శోభితలో తనకు నచ్చిన విషయం ఏమిటో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

శోభిత గురించి మాట్లాడుతూ ఆమె తెలుగు భాష స్కిల్స్ నన్ను ప్రతిరోజూ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయని నాగచైతన్య అన్నారు. మామ, మా కుటుంబ సభ్యులు కూడా తెలుగులోనే మాట్లాడుకుంటారని నాగచైతన్య అన్నారు. కానీ నేను చెన్నైలో చదువుకోవడం వల్ల తమిళం నేర్చుకున్నారని చెప్పాడు. ఇంట్లో నేను ఇంగ్లీషులోనే మాట్లాడుతాను. కాబట్టి నా తెలుగు భాష శోభిత భాష లాగా స్పష్టంగా ఉండదని నాగచైతన్య అన్నారు. శోభితనే నాకు తెలుగు నేర్పించాలి. తన తెలివితేటలని అందరికీ పంచుతూ ఉండాలని నేను జోక్ చేస్తానంటూ నాగచైతన్య వెల్లడించారు. ప్రస్తుతం నాగచైతన్య షేర్ చేసుకున్న ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: