కొంతమంది దర్శక నిర్మాతలు హీరోల జాతకాలను ముందుగానే అంచనా వేస్తూ ఉంటారు. అలా సూపర్ స్టార్ కృష్ణ జాతకాన్ని కూడా ఓ నిర్మాత ముందుగానే అంచనా వేశారు.మరి ఇంతకీ ఆ నిర్మాత ఎవరు? కృష్ణ జాతకం అలా ఉంటుందని ముందే ఎలా ఊహించారు అనేది ఇప్పుడు చూద్దాం.దివంగత నటుడు కృష్ణ ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలు పరిచయం చేశారు. ముఖ్యంగా కౌబాయ్ సినిమాలను టాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణదే. అయితే అలాంటి కృష్ణ ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో హిట్ సినిమాలు చేసి ఒక్క ఏడాదిలో 10, 12 సినిమాలను విడుదల చేశారు.అలా ఒక సంవత్సరం ఈయన ఏడు ఎనిమిది సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపారు.అంతేకాదు ఇప్పుడైతే ఒక సినిమా షూట్ చేయాలంటే దాదాపు రెండు మూడు సంవత్సరాల టైమ్ తీసుకుంటున్నారు. కానీ అప్పట్లో ఒక హీరో దాదాపు పది సినిమాల వరకు ఒకే ఏడాది కంప్లీట్ చేసేవారు. మూడు షిఫ్ట్ ల్లో పనిచేసేవారు. అయితే అలా మూడు షిఫ్ట్ ల్లో పనిచేసిన హీరోలలో కృష్ణ కూడా ఒకరు.

ఈయన ఒకే ఏడాది 10,12 సినిమాల్లో నటించేవారు. అయితే అలాంటి కృష్ణ జాతకం అస్సలు బాలేదని ముందే నిర్మాత చక్రపాణి చెప్పారట. ఇక అసలు విషయం ఏమిటంటే.. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా అంటే ఇష్టపడని వారు ఉండరు.ఈ సినిమా చాలామందికి ఇష్టం. అయితే ఈ సినిమాని చూసిన అప్పటి విజయ వాహిని స్టూడియోస్ అధినేత నిర్మాత అయినటువంటి చక్రపాణి ఓసారి కృష్ణని పిలిపించారట. కృష్ణని పిలిపించుకొని ప్రస్తుతం నువ్వు ఎన్ని సినిమాలు చేస్తున్నావు అని అడగగా..నేను ఇప్పుడు 8,9 సినిమాల్లో నటిస్తున్నాను అని కృష్ణ సమాధానం ఇచ్చారట.ఇక కృష్ణ ఇచ్చిన ఆన్సర్ కి చక్రపాణి కృష్ణ హర్ట్ అయ్యే ఆన్సర్ ఇచ్చారట. అదేంటంటే..నీతో సినిమా చేసే దర్శక నిర్మాతల పని గోవిందా..వాళ్లు తట్టా బుట్టా సర్దాల్సిందే అని అన్నారట.అయితే చక్రపాణి మాటలకి హర్ట్ అయిన కృష్ణ ఎందుకండీ అలా మాట్లాడుతున్నారు అల్లూరి సీతారామరాజు సినిమా చూశారు కదా మీకు నచ్చలేదా అని అడగగా.. అది నచ్చని వారు ఎవరైనా ఉంటారా.ఈ సినిమాలో అద్భుతంగా నటించావు.

కానీ అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత నీపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతాయి. దాంతో నువ్వు నెక్స్ట్ చేసే సినిమాలపై భారీ అంచనాలు ఉంటాయి. నిన్ను అల్లూరి సీతారామరాజు సినిమాలో చూసినట్టే చూడాలి అనుకుంటారు. కానీ నువ్వు చేసే నెక్స్ట్ సినిమాల్లో ఏమాత్రం తేడా కొట్టినా కూడా అవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతాయి. అందుకే నువ్వు నెక్స్ట్ సినిమాల్లో కాస్త జాగ్రత్తగా ఉండు.ఈ సినిమాలో చాలా గొప్పగా నటించావు.కాబట్టి రాబోయే సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండాలి అని చెప్పారట. అయితే చక్రపాణి చెప్పినట్లే అల్లూరి సీతారామరాజు తర్వాత కృష్ణ నటించిన దాదాపు 14 సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో కృష్ణ కెరియర్ ఆగిపోయింది అని అందరూ అనుకున్నారు.కానీ 15వ సినిమాగా వచ్చిన పాడిపంటలు మూవీ హిట్ కొట్టడంతో మళ్ళీ కృష్ణ ఇండస్ట్రీలో కంబ్యాక్ అయ్యారు. అలా అల్లూరి సీతారామరాజు తర్వాత చక్రపాణి కృష్ణ జాతకాన్ని ముందుగానే ఊహించారు. ఆయన చెప్పినట్టే ఈ సినిమా తర్వాత దాదాపు 14 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: