దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారుండారు. ఈయనకు మామూలు ఫాలోయింగ్ ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో రామ్ గోపాల్ వర్మకి మంచి క్రేజ్ ఉంటది. ఈయన నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇక తాజాగా మరోసారి వర్మ వార్తల్లో మెరిశారు. ఇటీవల వర్మ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది అమాయకులు నష్టపోతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కూడా చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ని ఎక్కువగా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది నష్టపోతూ.. సమస్యలు ఎదురుకుంటున్నారు. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ చేసిన మంచు లక్ష్మీ, విజయ్ దేవరకొండ, యాంకర్ విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, యూట్యూబర్ టేస్టీ తేజ, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతూ చౌదరి, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ లపైన కేసులు నమోదు చేశారు.


అయితే ఇదిలా ఉండగా.. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ శారీ. ఈ సినిమాలో సత్య యాధు, ఆరాధ్య దేవి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా రామ్ గోపాల్ వర్మ బ్యానర్ పై తెరకెక్కనుంది. ఇటీవలే శారీ టైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. ఏ సంస్థకు యాడ్స్ చేసిన, అది లీగల్ సంస్థ కాదు అనేది స్టార్స్ కి తెలియకపోవచ్చు. దానిపై నటీనటులకు అధికారులు అవగాహన కల్పించాలి. ఇలా సడెన్ గా చర్యలు తీసుకోవడం సరికాదు. రాజకీయాలు, సినిమాలు వేరు. పోసానిని అరెస్ట్ చేస్తే ఆయన సినిమాలు ఆపేయారు కదా' అని చెప్పుకొచ్చాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

rgv