రాజమౌళి డైరెక్షన్లో సినిమా అంటే మాటలు కాదు. అది మామూలు విషయం కూడా కాదు . దానికి ఎన్నో ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి అని అంతా మాట్లాడుకుంటూ ఉంటారు . ఎందుకంటే రాజమౌళి ఇప్పటివరకు తెరకెక్కించిన అన్ని సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్. దానికి కారణం కూడా ఆయన హార్డ్ వర్క్ అని అందరికీ తెలుసు . అలాంటి రాజమౌళి డైరెక్షన్ లో సినిమా ఛాన్స్ రావాలి అంటే ఏ స్టార్ హీరో కైనా సరే లక్ ఉండాల్సిందే అని మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు . ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకి రాజమౌళికి అసలు ఎలా కుదిరింది అనే విషయం వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.


మనకు తెలిసిందే పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి - మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాపై ఎక్కడలేని ఆశలు అన్ని పెట్టుకుని ఉన్నారు జనాలు . అయితే అసలు రాజమౌళికి మహేష్ బాబు  తో సినిమా తెరకెక్కించాలి అనే  ఆలోచన ఎలా వచ్చింది . సాధారణంగా మహేష్ బాబు ఇలా లాంగ్ పీరియడ్ క్యాప్ తీసుకొని కాల్ షీట్స్ తీసుకునే డైరెక్టర్స్ తో వర్క్ చేయరు. మరి ఎలా ఓకే చేశాడు..?  రాజమౌళి ఏం చెప్పి ఒప్పించాడు..? అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు .



నిజానికి వీళ్లిద్దరి కాంబో కుదిరేలా చేసింది రామ్ చరణ్ అంటూ ఓ న్యూస్ తెర పైకి వచ్చింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ టైంలోనే  రాజమౌళి -  మహేష్ బాబు తో తెరకెక్కించే కథను రాసుకున్నారట . ఇదే టైంలో చాలా సరదాగా జరిగిన డిస్కషన్ లో ఈ పాత్రకు ఏ క్యారెక్టర్ హీరో సెట్ అవుతాడు అని బాగా థింక్ చేయగా ఒక్కొక్క పేరుని అక్కడ ఉండేఅవాళ్లు సలహా ఇచ్చారట . కొందరు అల్లు అర్జున్ మరికొందరు పవన్ కళ్యాణ్ మరికొందరు కోలీవుడ్ హీరో సూర్య ఇలా అందరూ తమకు తోచిన విధంగా హీరో పేరుని సజెస్ట్ చేసారట . అయితే పక్కనే ఉన్న రాంచరణ్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కి మహేష్ బాబు అయితే వేరే లెవెల్ లో ఉంటాడు అని.. ఆయన ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ లో కనిపించలేదు .. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే మాత్రం సూపర్ డూపర్ హిట్ చేస్తారు జనాలు  సలహా ఇచ్చాడట చరణ్. అలా  మహేష్ బాబు పేరు రాజమౌళికి తట్టిందట . లేకపోతే ఈ సినిమాని వేరే హీరోతో తెరకెక్కించి ఉండేవారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: