
కానీ ఎవరు ఊహించని విధంగా ట్రాక్లోకి పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ వచ్చి చేరాడు . అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో సినిమా రాబోతుంది అంటూ పాన్ వరల్డ్ స్థాయిలో వినిపించింది. దానికి తగ్గట్టే హైదరాబాద్ వచ్చి మరి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ టీం..అల్లు అర్జున్ ని కలవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎవరు ఊహించిన విధంగా మధ్యలోకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ యాడ్ అయ్యారు . ఆయన అల్లు అర్జున్ నే ముంబైకి పిలిపించుకొని మరి స్పెషల్ గా మీట్ అయ్యారు .
దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీస్ షేక్ అయిపోయింది . సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఆ అదృష్టం అందరికీ రాదు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కథలోకి మరో స్టార్ డైరెక్టర్ వచ్చి చేరినట్లు టాక్ వినిపిస్తుంది . తన సినిమాలతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన నెల్సన్ తో అల్లు అర్జున్ ఒక సినిమాను తెరకెక్కించబోతున్నాడు. అల్లు అర్జున్ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ టాక్ వినిపిస్తుంది . ఇలా బ్యాక్ టు బ్యాక్ బడా స్టార్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా అల్లు అర్జున్ తో సినిమా అంటూ వార్తలు వినిపిస్తూ ఉండడంతో .. అల్లు అర్జున్ పేరు మరొకసారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు వీళ్లందరితో ఖచ్చితంగా అల్లు అర్జున్ సినిమా ఓకే చేస్తే మాత్రం నో డౌట్ పాన్ వరల్డ్ స్థాయిలో నెంబర్ వన్ హీరోగా అల్లు అర్జున్ రాజ్యమేలేస్తాడు అంటున్నారు బన్నీ ఫాన్స్ . అయితే అసలు ఈ డైరెక్టర్స్ తో నిజంగానే సినిమాకి కమిటీ అయ్యాడా..? లేకపోతే ఇదంతా ఫేక్ వార్తలా..? తెలియాలి అంటే అల్లు అర్జున్ లేదా అల్లు అర్జున్ టీం స్పందించాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్..!