సాధారణంగా స్టార్ హీరోలు బిగ్ రిస్కీ పనులు చేయరు . రిస్కీ షాట్స్ లో కనిపించడం.. నటించడం లాం,టివి చేయరు.  తమ ప్లేసులో డూప్స్ ని పెడుతూ ఉంటారు.  ఆ విషయం అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ బిగ్ రిస్క్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . అందరు హీరోలు చేస్తున్నారు మనం  చేస్తే తప్పేంటి అని అనుకున్నారో.. లేకపోతే అసలు ఎందుకు ఈ తలనొప్పి లు డూప్స్ పెట్టి ట్రోలింగ్ కి గురవ్వడం  .. కొంచెం రిస్క్ చేసి  మనమే ఒరిజినల్గా చేస్తే బాగుంటుంది అని ఆలోచన కి వచ్చారో రీజన్ ఏంటో తెలియదు కానీ స్టార్ హీరోలు ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరుగా కి రిస్కీ షాట్స్ లో నటించడానికి ఓకే చేస్తున్నారు .


ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో ఆర్ఆర్ఆర్  సినిమా టైంలో డూప్ లేకుండా రిస్కీ స్టాంట్ చేశారు . అదేవిధంగా మహేష్ బాబు సైతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు ఇలాగే చేయబోతున్నారట.  ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే లిస్ట్ లోకి వచ్చాడు అంటూ  వార్తలు వినిపిస్తున్నాయి. ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న బుచ్చిబాబు సన్న దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాకి కమిట్ అయిన సంగతి అందరికి తెలిసిందే.



ప్రసెంట్ వీళ్ల కాంబోలో తెరకెక్కే సినిమా సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో రిస్కీ షాట్ చేయబోతున్నారట రామ్ చరణ్. పది నిమిషాల పాటు సాగే ఫైట్ సీన్స్ లో ఎటువంటి డూప్ లేకుండా నటించబోతున్నారట.  ఇది మొత్తం ఒక ఫైర్ యాక్సిడెంట్ నేపథ్యంలో ఈ ఫైట్స్ ని తెరకెక్కించబోతున్నారట.  ఫైర్ అంటే మాటలు కాదు .. కొంచెం అటు  ఇటు అయినా సరే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది . అలాంటి  సీన్స్ ని రాంచరణ్ చేయబోతున్నాడా..? ఇంత బిగ్ రిస్క్ చేయబోతున్నాడా..? అంటూ మాట్లాడుకుంటున్నారు.  దాని వెనక ఏదో బిగ్ రీజన్ ఉండే ఉంటుంది అంటున్నారు జనాలు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: