కొంతమంది నటీనటులు చేతిదాకా వచ్చినా అవకాశాలను కాలదన్నుకుంటారు.కానీ ఆ అవకాశాలను వదులుకున్నాక వాళ్ల కోసం అనుకున్న పాత్రలో వేరే వారిని పెట్టి సినిమాలు చేసి హిట్ కొట్టగా అరెరే ఉత్త పుణ్యానికి సినిమాను వదిలేసుకున్నామే.. చేసి ఉంటే మంచి పేరు వచ్చేది కదా.. అని బాధపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ హీరోయిన్స్ కూడా హిట్ సినిమాల్లో మంచి అవకాశాలను వద్దనుకొని బ్యాడ్ లక్ అనిపించుకున్నారు.మరి ఇంతకీ హిట్ సినిమాలు రిజెక్ట్ చేసిన ఆ అన్ లక్కీ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత మూవీ అందరు చూసే ఉంటారు. అయితే ఈ మూవీలో హీరో తల్లి పాత్రలో సీనియర్ నటి దేవయాని నటించింది. కానీ ఈ అవకాశం మొదట సీనియర్ నటి లయకి వచ్చిందట. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. అలాగే రవితేజ రాజా ది గ్రేట్ మూవీ లో రవితేజ తల్లి పాత్రలో నటించే అవకాశం రాధిక కంటే ముందు విజయశాంతికి వచ్చిందట.

కానీ విజయశాంతి రిజెక్ట్ చేయడంతో రాధిక నటించింది. అలాగే రంగస్థలంలో రంగమ్మత్త పాత్ర కి యాంకర్ అనసూయ కంటే ముందు సీనియర్ నటి రాశిని అనుకున్నారట.కానీ రాశి నో చెప్పడంతో అనసూయ రంగమ్మత్త పాత్రలో ఫిక్స్ అయింది. అలాగే రజినీకాంత్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నరసింహ మూవీ లో నీలాంబరి అనే నెగటివ్ పాత్ర రమ్యకృష్ణ కంటే ముందు మీనాకి వచ్చిందట. కానీ మీనా తల్లి నా కూతురు ఇప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ టైంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తే ఆమెకు అన్ని అలాంటి క్యారెక్టర్లే వస్తాయని రిజెక్ట్ చేసిందట.కానీ రమ్యకృష్ణ నీలాంబరి పాత్ర ద్వారా చాలా పాపులర్ అయింది. ఇక మహేష్ బాబు నిజం సినిమాలో మహేష్ తల్లి పాత్రలో చేసే అవకాశం మొదటి శ్రీదేవి, రేఖ, జయసుధ లకి వచ్చిందట. కానీ శ్రీదేవి, బాలీవుడ్ నటి రేఖ ఇద్దరు నో చెప్పడంతో రామేశ్వరి ఈ మూవీలో మహేష్ తల్లి పాత్రలో నటించింది.

అయితే జయసుధ కూడా చేస్తానన్నప్పడికి డేట్స్ అడ్జస్ట్ కాక వదులుకుందట. ఇక ఇప్పటికి కూడా రామేశ్వరిని నిజం మూవీలో మహేష్ తల్లి గానే గుర్తుపడతారు. అలాగే మహర్షి మూవీలో మహేష్ తల్లి పాత్రలో చేసే అవకాశం జయప్రదకి వచ్చినప్పటికీ ఆమె చేయనని చెప్పకపోవడంతో జయసుధ ఈ మూవీలో నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ లో అంజలి నటించిన సీత పాత్ర కోసం మొదట బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని అనుకున్నారట.కానీ ఆ హీరోయిన్ నో చెప్పడంతో అంజలికి అవకాశం వచ్చింది.అలాగే బాహుబలి మూవీలో రమ్య కృష్ణ పోషించిన శివగామి పాత్ర మొదట శ్రీదేవికి వచ్చింది. కానీ శ్రీదేవి ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో రమ్యకృష్ణ నటించింది. అలాగే మహేష్ బాబు శ్రీమంతుడు మూవీలో నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గ్రేసీ సింగ్ కి మహేష్ తల్లి పాత్రలో నటించే ఛాన్స్ వచ్చిందట.కానీ ఆ హీరోయిన్ నో చెప్పడంతో సుకన్య ఈ అవకాశాన్ని అందుకుంది. అలా ఎంతో మంది హీరోయిన్లు చేతిదాకా వచ్చిన అవకాశాలను రిజెక్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: