బ్యానర్: థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్
సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్
ఎడిటింగ్ : మధు
సినిమాటోగ్ర‌ఫీ : సుజాత సిద్దార్థ్
మ్యూజిక్ : శేఖర్ చంద్ర
నిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల
స్క్రీన్ ప్లే & దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి
రిలీజ్ : SVC
రిలీజ్ డేట్‌: 21, మార్చి, 2025


పెళ్లి కాని ప్రసాద్ కథ:
ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో ఒక స్టార్ హోటల్లో ప‌ని చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. 38 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చినా త‌న తండ్రి ( ముర‌ళీధ‌ర్‌) త‌మ పూర్వీకుల క‌ట్నం స్టోరీ చెప్పి 2 కోట్లకు త‌క్కువైతే పెళ్లి చేసుకోకూడ‌ద‌న్న మాట త‌ప్ప‌లేక వెయిట్ చేస్తుంటాడు. ఓ అమ్మాయి అయ్యి ఉండి రు. 2 కోట్లు ఇస్తే చాలు పెళ్లి చేసేసుకోవాల‌ని అనుకుంటాడు. ఈ టైంలో స‌ప్త‌గిరికి అదే ఊళ్లో ఉండే ప్రియ ( ప్రియాంక‌శ‌ర్మ‌) ప‌రిచ‌యం అవుతుంది. ఆమె కాస్త ఆధునిక భావాలున్న అమ్మాయి. త‌న త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఫారిన్‌లో సెటిల్ అవ్వాల‌ని క‌ల‌లు కంటూ ఉంటుంది. ప్ర‌సాద్‌ను ట్రాప్ చేసి పెళ్లాడుతుంది. ప్ర‌సాద్ ఫారిన్ వెళ్ల‌కూడ‌ద‌నుకుంటాడు. ఈ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు త‌లెత్తుతాయి. అస‌లు ప్ర‌సాద్ ఫారిన్ ఎందుకు ?  వెళ్ల‌కూడ‌ద‌నుకుంటాడు ?  చివ‌ర‌కు పెళ్లికాని ప్ర‌సాద్‌... పెళ్లి చేసుకున్న ప్ర‌సాద్ అయ్యాక ఎలాంటి క‌ష్టాలు ప‌డ్డాడు ?  చివ‌ర‌కు ఏం జ‌రిగింది ? అన్న‌దే క‌థ‌.


విశ్లేష‌ణ :
ఈ సినిమాను స‌ప్త‌గిరి త‌న భుజ‌స్కంధాల మీద న‌డిపించాడు. వ‌న్ మ్యాన్ షో చేసి ప‌డేశాడు. వ‌య‌స్సు పై బ‌డుతున్నా ఇంకా పెళ్లి కాక‌.. తండ్రిని ఎదిరించ‌లేక ఇబ్బంది ప‌డే పాత్ర‌లో న‌వ్వించాడు. త‌ర్వాత ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నాక ఆమె త‌న‌ను కాకుండా త‌న ఫారం ఉద్యోగాన్ని చూసి ప్రేమించిందని తెలిశాక తీవ్రంగా మ‌ద‌న‌ప‌డే పాత్ర‌లో ఇమిడిపోయాడు. స‌ప్త‌గిరి త‌ర్వాత ఆ స్థాయిలో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో ముర‌ళీధ‌ర్‌గౌడ్‌ది. మ‌రోసారి త‌న న‌ట‌న ఫ్రూవ్ చేసుకునే ఛాన్స్ వ‌చ్చింది. అన్నపూర్ణమ్మ, ప్రమోదిని, పాషా ట్రాక్ ఆకట్టునేల ఉంది. మిగతా నటీనట్లు అందరూ తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేసేలా ద‌ర్శ‌కుడు ఆ పాత్ర‌ల‌ను తీర్చిదిద్దాడు.


ఇక టెక్నిక‌ల్‌గా చూస్తే శేఖర్ చంద్ర అందించిన పాటలతో పాటు నేప‌థ్య సంగీతం బాగుంది. చాలా సీన్ల‌లో ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గిన‌ట్టుగా వాడిన మీమ్ కంటెంట్ బాగా క‌నెక్ట్ అయ్యింది. సినిమాటోగ్ర‌ఫీ రిచ్ లుక్ తీసుకువ‌చ్చింది. ఇంట్ర‌డ‌క్ష‌న్ పాట‌తో పాటు కొన్ని పాట‌ల పిక్చ‌రైజేష‌న్ బాగుంది. డైలాగులు అటు నవ్విస్తూ.. ఇటు ఆలోచింప‌జేసేలా ఉన్నాయి. సినిమాలో మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ ఉన్నా ద‌ర్శ‌కుడు ఆ దిశ‌గా వెళ్ల‌కుండా ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించే ప్ర‌య‌త్న‌మే ఎక్కువుగా చేసిన‌ట్టు క‌నిపిస్తుంది. సిచ్యువేష‌నల్ కామెడీ బాగా పండించి వ‌ర్క‌వుట్ చేశాడు ద‌ర్శ‌కుడు.


ఇక పెళ్లి చుట్టూ రాసుకున్న ఎన్నో క‌థ‌లు మ‌నం ఇప్ప‌టికే చూశాం. ఈ సినిమా అలాంటి క‌థ‌తోనే తెరకెక్కినా ఒక పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న కుర్రాడిని పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోవాలనుకుంటున్న అమ్మాయి ఫ్యామిలీతో క‌లిసి ట్రాప్ చేయ‌డం.. ఆ త‌ర్వాత అత‌డు ఫారెన్ వెళ్ల‌డు అని తెలిశాక ఏం చేశారు ? అన్న లైన్‌తో ఈ సినిమా తెర‌కెక్కించారు. లైన్ తెలిసిందే అయినా ఆద్యంతం కామెడీతో ప్రేక్ష‌కులను న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. కొన్ని చోట్ల కామెడీ కాస్త అతి అనిపించినా బాగా పేలింది.


పంచ్ లైన్ : ఈ పెళ్ళి కాని ప్రసాద్ కష్టాలు ఫుల్ కామెడీ

రేటింగ్ : 2.75 / 5

మరింత సమాచారం తెలుసుకోండి: