తమిళ దర్శకుడు లింగస్వామి డైరెక్షన్లో కార్తీ తమన్నా జంటగా వచ్చిన ఆవారా మూవీ అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా అందరూ చాలా ఇష్టంగా చూస్తారు.అంతే కాదు ఈ సినిమా విడుదలైన సమయంలో ఎన్నో సంచలనాలు సృష్టించింది. చాలా సెంటర్లలో వంద రోజులు ఆడి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ కొట్టింది.అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆవారా మూవీ గురించి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు డైరెక్టర్ లింగుస్వామి. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నా డెడికేషన్ కి నేను ఫిదా అయ్యానని, ఆమె కారులోనే బట్టలు మార్చుకుంది.ఆ టైంలో ఆమె వృత్తిపట్ల ఎంత నిబద్ధత కలిగివుందో అర్థం చేసుకోవచ్చు అంటూ తమ్మన్నాని పొగుడుతూ మాట్లాడారు. 

అయితే ఆవారా సినిమా షూటింగ్ పూర్తిగా ట్రావెలింగ్ నేపథ్యంలోనే ఉంటుందనే సంగతి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది.ఒక కారులో హీరో కార్తీ,హీరోయిన్ తమన్నా ని ముంబై వరకు తీసుకు వెళ్లడమే ఎక్కువగా చూపిస్తారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కారులోనే ఎక్కువ షూటింగ్ ఉంటుంది కాబట్టి కేరావాన్ లు కూడా అందుబాటులో లేకపోవడం వల్ల హీరోయిన్ తమన్నా తన బట్టల్ని కూడా కారులోనే మార్చుకునేదట. ఆ టైంలో కారు చుట్టూ కొంతమంది అమ్మాయిలు కొన్ని క్లాత్ లు పట్టుకొని అడ్డుగా నిల్చొని ఉంటే తమన్నా కారులో బట్టలు మార్చుకునేదట. అలా ఎన్నో ఇబ్బందులు పడి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశామని,పడిన ఇబ్బందులకు ప్రతిఫలంగా సినిమా భారీ హిట్టు కొట్టింది అంటూ లింగు స్వామి చెప్పుకొచ్చారు.

అయితే ఈ విషయం పక్కన పెడితే.. తమన్నా నటించిన ఆవారా సినిమాలో మొదట వేరే హీరోయిన్ ని అనుకున్నారట. కానీ ఆ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో తమన్నా ఈ మూవీలో చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు నయనతార. అయితే ఆవారా మూవీలో మొదటి నయనతార హీరోయిన్ గా చేస్తానని ఒప్పుకున్నప్పటికీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలో నటించనని చెప్పిందట. కానీ చాలామంది నయనతార ఈ సినిమాలో తమన్నా అంత డెడికేషన్ తో నటించేది కాకపోవచ్చు. ఎందుకంటే తమన్నా కేరావాన్ లేకపోయినా కారుతో సరిపెట్టుకుంది.కానీ నయనతార మాత్రం అలా ఉండదు కదా అంటూ ఆమెపై కొంతమంది నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: