
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న యాక్టర్స్ పలువురు స్టార్స్ సైతం ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తూ ఉండడంతో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ అనన్య నాగళ్ల పరిస్థితి ఇప్పుడు ఎదురయ్యింది. ఆమె కూడా ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశానని తాజాగా ఒక న్యూస్ ఛానల్ లో జరిగిన డిస్కషన్ లో ఈ విషయాన్ని ఆమె తన చేసిన తప్పును ఒప్పుకోవడం జరిగింది.
తాను తెలుసో తెలియకో ఒక బెట్టింగ్ యాప్ని సైతం ప్రమోట్ చేశానని అయితే దానివల్ల ఇంత నష్టం జరుగుతుందని తనకి అసలు అనుకోలేదని తెలిపింది అనన్య.. తన ప్రమోషన్ వల్ల నష్టపోయిన వారికి తాను తిరిగి డబ్బులు ఇచ్చానని వెల్లడించింది. కానీ తాను తెలియక చేసిన ఈ తప్పును క్షమించండి అంటూ తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో స్టోరీని కూడా పంచుకోవడం జరిగింది. తనకి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ నుంచి 1.20 లక్షల రూపాయలు ఇచ్చారని ఆ బెట్టింగ్ గ్యాప్ వల్ల నష్టం జరుగుతుందని తెలిపాక తాను ఆ యాప్ను ప్రమోట్ చేయడం కూడా మానేశానని వెల్లడించింది అనన్య. మరి ఈ విషయం పైన అధికారులు ఏమంటారో చూడాలి.