
కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా చాలా మంచి టాలెంటెడ్ హీరోయిన్. చాలా చాలా మంచి సినిమాలలో నటించింది . తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకుంది . అలాంటి కాజోల్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసింది . ఆ సినిమా మరేంటో కాదు "శంకర్ దాదా ఎంబిబిఎస్". ఈ సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయింది అనేది అందరికీ తెలుసు. ఈ సినిమాలో సోనాలి బింద్రే హీరోయిన్గా నటించింది . నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా డైరెక్టర్ కాజోల్ ని అనుకున్నారట .
ఆమెను అప్రోచ్ కూడా అయ్యారట కానీ కాజోల్ మాత్రం అసలు కథ వినకుండా రిజెక్ట్ చేసిందట . తెలుగు సినిమాలో నటించాలి అన్న ఇంట్రెస్ట్ లేకనో.. లేకపోతే వేరే కారణమేదైనా ఉందో తెలియదు కానీ అప్పట్లో కాజోల్ బాగా బాగా ట్రోల్ చేశారు జనాలు . కాజోల్ - మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించి ఉంటే మాత్రం ఆమె కెరియర్ ఇంకా ఆమె ఊహించిన స్థాయికి ఎదిగిపోయి ఉండేది అనేది మెగా ఫ్యాన్స్ అభిప్రాయం. మొత్తానికి కాజోల్ చిరంజీవితో నటించే ఛాన్స్ పూర్తిగా మిస్ అయిపోయింది. కనీసం సెకండ్ ఇన్నింగ్స్ లో అయినా సరే ఆమె చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తుందేమో చూద్దాం..!!?