ఏపీ వైసీపీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారా? సీఎం జగన్ కే చుక్కలు చూపిస్తున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో కూటమి జగన్ ఎన్నిసార్లు కోరినా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అంగీకరించలేదనే సంగతి తెలిసిందే. కేవలం 11 స్థానాలకే వైసీపీ పరిమితం కావడం వల్ల నియమ నిబంధనల ప్రకారం వైసీపీ ఎన్నిసార్లు కోరినా ప్రతిపక్ష హోదా అయితే దక్కలేదని చెప్పవచ్చు.
 
అయితే రాష్ట్రంలో పరిస్థితులు ఇతర రాష్ట్రాలకు భిన్నమని రాష్ట్రంలో మరో ప్రతిపక్ష పార్టీ లేదు కాబట్టి తమకే ఇవ్వాలని వైసీపీ వాదనగా ఉంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాని పక్షంలో అనర్హత వేటు వేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
 
ఏడుగురు ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టారంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెబుతున్నారు. చంద్రబాబు సైతం సంతకం పెట్టి సభలో ఉండని నేతల విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఈ సంతకాలకు సంబంధించి వైసీపీ నేతల వాదన మరో విధంగా ఉంది. తాము ప్రశ్నలు అడగాలంటే సంతకాలు కచ్చితంగా పెట్టాలని అధికారులు సూచించారని వాళ్లు చెబుతున్నారు.
 
దొంగ సంతకాలు అంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాళ్లు ఈ కామెంట్లు చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారని ఒక్కో సమయంలో ఒక్కో విధంగా చెబుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు తమ అతి తెలివితో చేస్తున్న పనులు మాత్రం పార్టీకి కొత్త ఇబ్బందులను కలిగిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు. వైసీపీ నేతలు భవిష్యత్తులో అసెంబ్లీ సమావేశాల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాల్సి ఉంది. వైసీపీ నేతల భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. జగన్ సైతం పార్టీ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.








మరింత సమాచారం తెలుసుకోండి: