
బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసి తప్పు చేశానని నాకు ఇటీవల అర్థమైందని బాలీవుడ్ లో పెద్ద సెలబ్రిటీలు సైతం ఇలాంటి యాప్స్ కు ప్రచారం చేస్తున్నారని వాళ్లు అన్నీ చూసుకుని చేసి ఉంటారని నేను భావించానని ఆమె తెలిపారు. వాళ్లు తప్పు చేశారని మనం కూడా తప్పు చేయాల్సిన అవసరం అయితే లేదని అనన్య వెల్లడించారు. బేసిక్ కామన్ సెన్స్ తోనే వ్యవహరించాలని అనన్య అన్నారు.
నేను లా చదివానని ఆ సమయంలో అంతలా అవేర్ నెస్ లేదని అనన్య పేర్కొన్నారు. నాకు కేవలం లక్షా 20 వేల రూపాయలు ఇచ్చారని అందుకు సంబంధించి నేను ప్రాడక్ట్ స్టేటస్ పెట్టానని అనన్య తెలిపారు. గేమింగ్ యాప్ కోసం ఒక యాడ్ అనుకున్నానే తప్ప ఇలా జరుగుతుందని ఫీల్ కాలేదని అనన్య చెప్పుకొచ్చారు. నా స్టోరీ చూసి నష్టపోయిన వాళ్లకు నేనే డబ్బులు తిరిగి ఇచ్చానని ఆమె కామెంట్లు చేశారు.
అవేర్ నెస్ వచ్చిన తర్వాత నేను అలా ప్రమోషన్స్ చేయడం ఆపేశానని అనన్య నగళ్ల వెల్లడించారు. అనన్య నగళ్ల రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉంది. అనన్య నగళ్ల కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. అనన్య నగళ్ల క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది. అనన్య భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. అనన్య రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.