ఈ సమ్మర్ బాక్సాఫీస్ వార్‌లో ఈ నెలాఖరుకు నితిన్ నటించిన రాబిన్‌ హుడ్ రిలీజ్ కు రెడీ అయింది .. ప్రమోషన్లు ఎంతో కొత్తగా ప్లాన్ చేస్తున్నారు .. నితిన్ , శ్రీలీల జంటగా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ .. అలాగే అదిరా సర్ప్రైజ్ సాంగ్ మరో ఎత్తు వీటితో పాటు స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఉన్నారు .. క్రికెట్ ను ఆస్వాదించే వారికి డేవిడ్ వార్న‌ర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు .. మైదానం లో వార్నర్ చిచ్చర పిడుగు రీల్స్ లో కూడా తన ప్రావీణ్యం చూపించుకున్నాడు .. ప్రధానంగా పుష్పా సమయంలో వార్నర్ చేసిన రీల్స్ ఎంతో వైరల్ గా మారాయి ..


అలా తన లోని కొత్త టాలెంట్ ని బయటకు తీసుకొచ్చాడు ఈ స్టార్ క్రికెటర్ . ఇక ఇప్పుడు వార్నర్ తెలుగు సినిమాలో నటించ‌డం .. సినిమాకు ఎంతో ప్రద‌న‌ ఆకర్షణే .. నితిన్ రాబిన్ హూడ్ సినిమాలో డేవిడ్ ఎంతసేపు కనిపిస్తాడు ? అతని పాత్రనిడివి ఎంత ? అతనికి రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు ? అనే విషయాల పై ఆసక్తికర చర్చ వైరల్ గా మారింది .. వార్నర్ ఈ సినిమాలో ఇలా కనిపించి ,  అలా మాయ‌మైపోయే పాత్ర కాదని .. ఆయన క్యారెక్టర్ కంటు ఓ ప్రత్యేక స్పేస్ ఉంటుందని కూడా తెలుస్తుంది ..


సినిమాలో కనీసం ఐదు నిమిషాల పాటు వార్నర్ కనిపిస్తాడట .. ఇక ఈ సన్నివేశాలని నాలుగు రోజులు పాటు షూట్ చేశారని .. అందుకు గాను వార్నర్ కు రూ. 2.5 కోట్లు రెమ్యూన‌రేష‌న్‌ ఇచ్చారని టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాలు అంటున్నాయి .. అయితే నిజానికి వార్నర్ రోజుకు కోటి రూపాయలు అడిగారని .. అయితే మైత్రి వారు బేరాలు ఆడి 2.5 ఓకే చేశారని అంటున్నారు .. ఐదు నిమిషాల సన్నివేశానికి 2.5 కోట్లు ఇవ్వటం పెద్ద విషయమే .. అయితే వార్నర్ సినిమాకు ఎంత మాత్రం హెల్ప్ అవుతాడు ? తనకు ఇచ్చిన రెమ్యూన‌రేష‌న్‌ కి న్యాయం చేసినట్టే లేదా అనేది సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: