చిత్ర పరిశ్రమలో విజయాలు ఉన్నవాళ్ళకు మాత్రమే ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి .. అయితే కొంతమంది దర్శకులు సూపర్ సక్సెస్ లు అందుకుంటూ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు అసలు సక్సెస్ లు కూడా లేని హీరోలతో సినిమాలు చేసి వాళ్లకు భారీ విజయాలు కూడా అందించి స్టార్ హీరోలుగా మారుస్తూ ఉంటారు .. కానీ తర్వాత ఆ దర్శకులు కొంత ఫామ్ లో లేనప్పుడు ఆ హీరోలు వాళ్ళని అసలు పట్టించుకోవటం ఆదుకోవటం మాత్రం ఎలాంటి  సహాయం అసలు చెయ్యరు .. ఇక  పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ వరుసగా బ్యాక్ టు బ్యాక్ విజ‌యాలు సాధిస్తూ ముందుకు దూసుకు వెళ్తూ స్టార్ ద‌ర్శ‌కుల‌ లిస్టులో చేరిపోయిన తర్వాత మహేష్ బాబు లాంటి హీరో తో పోకిరి సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు ..


నిజానికి పోకిరి కి ముందు మహేష్ బాబుకి స్టార్ హీరో ఇమేజ్ లేదు .. కానీ పోకిరి సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్‌ చేయడంతో పాటు ఆయన మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు .. టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు .. ఇక ఆ తర్వాత బిజినెస్ మాన్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కూడా అందుకున్నాడు .. ఇలా వరుస రెండు విజయాలు వచ్చిన  పూరి జగన్నాథ్ కి మహేష్ బాబు మాత్రం ఇప్పుడు ఇలాంటి కిష్ట పరిస్థితుల్లో అసలు దగ్గరికి కూడా రానవటం లేదు . ఇక పూరి జగన్నాథ్ తో సినిమా చేసే సమయం తనకు లేదు అన్నట్టుగా మహేష్ బాబు ప్రవర్తన కనిపిస్తుంది .. అయితే వీరిద్దరి మధ్య ఎక్కడ ఈగో క్లాశేష్‌ వచ్చాయో తెలియదు కానీ మహేష్ బాబు మాత్రం ఇతర డైరెక్టర్లకి అవకాశాలు ఇస్తూ పూరి జగన్నాథ్‌ను మాత్రం పక్కకు నెట్టేస్తున్నాడు .. మరోపక్క పూరి అభిమానులు , మహేష్ అభిమానులు తీవ్రమైన మనస్థాపానికి లోనవుతున్నారు ..


ఎందుకంటే మహేష్ లో ఉన్న పూర్తి నటుడిని బయటికి తీయాలి అంటే అది పూరి వల్లే అవుతుంది .. దీని కారణంగానే మహేష్ ఆయనతో సినిమా చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరి అభిప్రాయం .. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా రాకపోవచ్చు అనేది కూడా వాస్తవం .. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకుడు సైతం టాప్ డైరెక్టర్గా ఉన్నప్పుడు అల్లు అర్జున్ మీడియం హీరోగా ఉన్నాడు . ఇక అతనికి జూలాయి , సన్నాఫ్ సత్యమూర్తి , అలా వైకుంఠపురం అని మూడు సినిమాలు విజయాలు అందించి అతని స్టార్ హీరోగా మలిచాడు .  ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్‌ కి పాన్ ఇండియా మార్కెట్ లేదని ఒక్క చిన్న ఉద్దేశంతో అతన్ని పక్కకు పెట్టే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్ .. అట్లీతో తన తర్వాత సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు .. ఇప్పుడు ఇదంతా చూస్తున్న అభిమానులు మాత్రం అల్లు అర్జున్ కు అసలు కృతజ్ఞత భావం లేదు అంటూ ఆయన పై భారీ ఎత్తున నెగిటివ్ కామెంట్లతో సోష‌ల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: