
ఇక సికందర్ సినిమా చాలా పెద్దది . మేము తరచుగా సెట్లు 10000 నుంచి 20వేల మందితో షూటింగ్ చేసేవాళ్లం .. ఇంత పెద్ద జన సమూహాన్ని నిర్వహించడానికి అధిక భద్రత అవసరం .. మా షెడ్యూల్ కూడా చాలా టఫ్ గా ఉంటుంది .. సల్మాన్ కు వచ్చిన హత్య బెదిరింపులతో అది మరింత హాట్ టాపిక్ గా మారిందని ఆయన చెప్పుకొచ్చాడు .. అదే విధంగా బెదిరింపుల నేపథ్యంలో షూటింగ్ షెడ్యూల్ ఏ విధంగా ప్రభావితం చేశాయో ఆయన ప్రస్తావించారు . ఇక ఆ భద్రతను కట్టుదిట్టం చేశారని కూడా చెప్పారు దర్శకుడు. ఇక సెట్ లోని అదనపు వస్తువులను తనిఖీ చేయడానికి ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటల సమయం పట్టేది .. అలాగే షూటింగ్ చేసే రోజులో ఎక్కువ సమయం అక్కడ రిజిస్ట్రేషన్లు చెకింగ్ కి సమయం అయిపోయేదని మురగదాస్ అన్నారు .. అలాగే మేము తరచుగా చిత్రీకరణ ఆలస్యంగా ప్రారంభించి ఆలస్యంగా పూర్తి చేసేవాళ్లం . అలాగే షూటింగ్ లోకేషన్ చాలా సానుకూలంగా ఎంతో ప్రశాంతంగా ఉండేది.
అలాగే సల్మాన్ తో సినిమా చేయడం గురించి కూడా ఆయన మాట్లాడుతూ .. ఇక ఈ కథకు అభిమానులు ఇష్టమైన స్టార్ హీరో అవసరమని ఆయన అన్నాడు సల్మాన్ సార్ ఈ పాత్రకు సరిగ్గా సూట్ అవుతారు .. ఆయన నిజ జీవితం ఈ పాత్రకు కథకు బలాన్ని తెచ్చి పెట్టింది .. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత తను ఎందుకు సల్మాన్ ను ఎంచుకున్నాను మీకు అర్థమవుతుందని మురగదాస్ చెప్పుకొచ్చారు .. ఇక ఈ సినిమా పక్క హిట్ అవుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు .. అలాగే ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తుంది .. ఇక రంజాన్ కానుకగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది .