న్యాచురల్ స్టార్ నానికి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. నాని తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుస విజయాలు నానికి ప్లస్ అవుతుండగా విభిన్నమైన కథలను ఎంచుకోవడం ద్వారా నాని కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం నాని హిట్3 సినిమాతో పాటు ది ప్యారడైజ్ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
 
నాని హిట్3 సినిమా డిజిటల్ హక్కులు 54 కోట్ల రూపాయలకు అమ్ముడవగా ది ప్యారడైజ్ సినిమా డిజిటల్ హక్కు 65 కోట్ల రూపాయలకు అమ్ముడవడం గమనార్హం. నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం 35 కోట్ల రూపాయల నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. నాని కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
 
న్యాచురల్ స్టార్ నాని సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. నాని సినిమాల గ్లింప్స్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో నాని కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. భాషతో సంబంధం లేకుండా నాని పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
 
న్యాచురల్ స్టార్ నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. న్యాచురల్ స్టార్ నాని భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో నాని సత్తా చాటితే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. నాని కంటెంట్ విషయంలో కొన్ని విమర్శలు వస్తున్నా పాత్రల కోసం నాని పడుతుండటం గమనార్హం. శైలేష్ కొలను, శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని సినిమాలు తెరకెక్కుతున్నాయి. నాని భవిష్యత్తు సినిమాలతో టైర్1 హీరోల జాబితాలో చేరినట్టేనని ఈ సినిమా హిట్టైతే నానికి తిరుగులేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: