రాజకీయాలకు చిత్ర పరిశ్ర‌మ‌కు ఎంతో అవినాభావ సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే .. నటరత్న ఎన్టీఆర్ తో మొదలైన సినీ రాజకీయాలు .. నిన్న మొదటి వరకు అలా కొనసాగుతూనే వచ్చాయి .. చాలామంది నటులు , నిర్మాతలు , దర్శకులు కూడా రాజకీయాలు చేశారు .. తమ పేరును చాటుకున్నారు .. దాసరి నారాయణరావు , కృష్ణ, రామానాయుడు , శారద ఇలా చాలామంది రాజకీయాల్లో అడుగుపెట్టి తమ సత్తా చాటారు .. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి . ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం రాజకీయ నాయకులు ఎదురుచూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి .. కానీ ఇప్పుడు టాలీవుడ్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు ..


అదేవిధంగా నటులు నిర్మాతలు కూడా వెనక్కి తగ్గుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి .. ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణలో కూడా టాలీవుడ్ నుంచి ఇప్పుడు రాజకీయాలపై సందడి తగ్గిందనే చెప్పాలి .  ఒక పార్టీకి అనుకూలంగా ఉండటం మరో పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయ నాయకులు దర్శకులు , నిర్మాతల్లో మార్పు వస్తుంది . వేధింపులు , కక్ష సాధింపులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తున్నాయి అంటుంది టాలీవుడ్ .. ఇక ఇప్పుడు తాజాగా ఓ ప్రైవేట్ సమావేశంలో తెలంగాణ చిత్ర పరిశ్రమ ఇదే అభిప్రాయానికి వచ్చింది .. గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు దర్శకులు ఇప్పుడు సినిమాలు తీసేందుకు లొకేషన్లు లభించిన పరిస్థితి రావడంతో .. ఎంతో రహస్యంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు ..


అలాగని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తే మళ్లీ బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని కూడా వారు వాపోతున్నారు . ఇక ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది .. చాలామంది నటులు నిర్మాతలు దర్శకులు కూడా తటస్థంగా ఉంటున్నారు .. వైసిపిని సమర్ధించిన  దర్శకులు ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు .. ఇందులో ఒకరిద్దరు కేసులు ఎదుర్కొంటున్నారు .. ఇక దీంతో అసలు రాజకీయాలు ఎందుకు ? ఆమె ధోరణి టాలీవుడ్ లో బాగా పెరిగిపోయింది .. అయితే గతంలో లాగా నటులు ప్రచారం చేసిన మాత్రన‌ ప్రజలు ఓటేస్తారన్న భావన కూడా మారిపోయింది .. ఇక దీంతో తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపు రాజకీయాలకు దూరంగా ఉండే దిశగానే అడుగులు  వేస్తుండటం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: