
కాగా గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ని నోరు తెరిచి అడిగిన సరే ఆ పని చేయకపోవడం ఆ తర్వాత మహేష్ బాబు వెంటనే ఆ పని చేసేయడం జనాలకు ఆశ్చర్యకరంగా అనిపించింది. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ పెద్ద హీరో .. ప్రభాస్ - మహేష్ బాబు కూడా పెద్ద హీరోలే కాదు అనడంలేదు. కానీ వాళ్లతో కంపేర్ చేస్తే పవన్ ఒక్క మెట్టు హై స్టెప్ లోనే ఉంటాడు.
పవన్ కళ్యాణ్ నోరు తెరిచి అడిగితే ఎవరు కూడా నో అని చెప్పరు. కానీ ప్రభాస్ మాత్రం నో చెప్పడం అప్పట్లో అందరికీ షాకింగ్ గా అనిపించింది . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా "జల్సా" . ఈ సినిమా ఎంత హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో వాయిస్ ఓవర్ కోసం ప్రభాస్ ని అప్రోచ్ అయ్యారట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . అయితే ప్రభాస్ తన వాయిస్ బాగోదు అంటూ రిజెక్ట్ చేశారట . వెంటనే మహేష్ బాబు ని అడగ్గా.. మహేష్ బాబు సెకండ్ కూడా ఆలోచించుకోకుండా ఒక్క రూపాయి తీసుకోకుండానే ఈ సినిమా మొత్తం కి వాయిస్ ఓవర్ ఇచ్చారట. అప్పట్లో ఈ వార్త బాగా ట్రెండ్ అయింది. అంతేకాదు ఒక స్టార్ హీరో నటించిన సినిమాకి మరొక స్టార్ హీరో మహేష్ బాబు వాయిస్ ఇవ్వడం కూడా ట్రెండ్ సెట్ చేశారు స్టార్ హీరోస్..!!