టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రోజురోజుకు ఎంతో మంది హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతూనే ఉన్నారు. అందులో కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లు కూడా టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అలాంటి వారిలో జాన్వి కపూర్ ఒకరు. నటి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ చిన్నది దివంగత నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ దంపతుల అమ్మాయి.


ధడక్ సినిమాతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకుంది. అనంతరం బాలీవుడ్ లో వరుసగా కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ బ్యూటీ కి పెద్దగా సక్సెస్ రాలేదు. అనంతరం ఈ చిన్నది టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న జాన్వి కపూర్ ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. దేవర-2, ఆర్సి 16 వంటి సినిమాలను చేస్తుంది. కాగా, ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.


నిత్యం తన అందాలను ఆరబోస్తూ గ్లామర్ ఫోటోషూట్లు చేస్తోంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇదిలా ఉండగా.... జాన్వి కపూర్ కు భారీగా ఆస్తులు ఉన్నాయి. తన తండ్రి, తల్లి సొంతంగా సంపాదించిన ఆస్తులు మాత్రమే కాకుండా జాన్వికి ముంబైలో ఓ ఖరీదైన ఫ్లాట్ కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ చిన్నది సోషల్ మీడియా ద్వారా, తన సినిమాల ద్వారా భారీగా డబ్బులను సంపాదిస్తోంది. అంతేకాకుండా ఈ చిన్నది ఒక్కో సినిమాలో తాను నటించినందుకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి గుర్తింపు అందుకుంది. ప్రస్తుతం జాన్వి కపూర్ కు రూ. 1000 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దాదాపు ఈ చిన్నది తన సొంతంగా సంపాదించిన ఆస్తులు కూడా భారీగానే ఉన్నాయట. 27 ఏళ్ల వయసులోనే 1000 కోట్లకు వారసురాలిగా ఎదిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: