
శ్రీనువైట్ల, వి.వి.వినాయక్, పూరీ జగన్నాథ్, శ్రీకాంత్ అడ్డాల, కృష్ణవంశీ తర్వాత ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ దర్శకుల రెమ్యునరేషన్లు సైతం పరిమితంగా ఉన్నాయి. టాలీవుడ్ దర్శకులు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు యంగ్ డైరెక్టర్లు తక్కువ సమయంలో మంచి సినిమాలను తెరకెక్కిస్తున్నారు.
పరిమిత బడ్జెట్ తో యంగ్ డైరెక్టర్లు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్లు ఇతర భాషల్లో సైతం భారీ విజయాలను సొంతం చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ దర్శకుల కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి. నిర్మాతలు సైతం ఈ దర్శకులతో సినిమాలను నిర్మించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
రాబోయే రోజుల్లో అయినా మారుతుందేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ ఓల్డ్ డైరెక్టర్లు కథల ఎంపికలో, కథనంలో మార్పులు చేయాల్సి ఉంది. ఈ విధంగా జరిగితే మాత్రమే కొత్త దర్శకులు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తున్నారు. అయితే టాలెంట్ ఎవరి సొంతం కాదు. సరైన ప్రాజెక్ట్ తో ముందులొస్తే సీనియర్ డైరెక్టర్లు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తారనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్లు ఫ్లాపుల్లో ఉన్న సమయంలో తమ రెమ్యునరేషన్ తగ్గించుకుని కొత్త హీరోలతో సినిమాలను తెరకెక్కించి ప్రూవ్ చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్లు అద్భుతమైన స్క్రిప్ట్ లతో ప్రూవ్ చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ డైరెక్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.