పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ 'హరిహర వీరమల్లు'.. గత కొన్నేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఎట్టకేలకు మోక్షం కలగబోతుంది.. ఎట్టకేలకు ఈ సినిమా మే 9న రిలీజ్‌ కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా 50 రోజులు సమయం మాత్రమే వుంది..ఈ సినిమాను మేకర్స్ మార్చి 28 నే రిలీజ్ చేయాల్సి వుంది కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల మే కి వాయిదా పడింది..అయితే ఈ సినిమాపై హీరోయిన్‌ నిధి అగర్వాల్ భారీ ఆశలే పెట్టుకుంది. ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు.మొదట్లో క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా షూటింగ్ ఆలస్యం కావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.. ఈ సినిమా మిగిలిన భాగానికి,జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ పై మేకర్స్ దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.. ఈ సినిమా ప్రొమోషన్స్‌ విషయంలో హీరోయిన్‌ నిధి అగర్వాల్ ఎక్కువగా లీడ్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది.హరిహర వీరమల్లు సినిమాను పవన్ కల్యాణ్ ఎక్కడా కూడా ప్రచారం చేయడం లేదు. నిజానికి ఆయన తన సినిమాల ప్రచారాన్ని పవన్ పెద్దగా పట్టించుకోరని అందరికీ తెలిసిందే.. ప్రస్తుతం రాజకీయాల్లో పవన్ బిజీగా ఉ‍న్నారు కాబట్టి అస్సలు ఈ సినిమా ప్రొమోషన్స్ జోలికి వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది.

అయితే, దర్శకుడు క్రిష్ ఈ సినిమా ప్రచారానాకి దాదాపు రాకపోవచ్చని తెలుస్తుంది. రెండో దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నా పెద్దగా బజ్‌ క్రియేట్‌ చేయలేకపోవచ్చు.. దీనితో ఈ భారీ పాన్ ఇండియా చిత్రం ప్రచార భారమంతా నిధి అగర్వాల్ తీసుకోనున్నట్లు సమాచారం..'హరి హరవీరమల్లు' విడుదల కోసం నిధి అగర్వాల్‌ చాలా ఏళ్ల నుంచి ఎదురుచూస్తుంది. అందుకే ఈ మూవీ ప్రచార బాధ్యతల్ని ఆ మె తీసుకోనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: