టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు అందుకున్న సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా సుకుమార్ పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనంతరం పుష్ప-2 సినిమాతో సుకుమార్ మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా సుకుమార్ రేంజ్ ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది.


ప్రస్తుతం సుకుమార్ తో కలిసి సినిమాలు తీయడానికి స్టార్ హీరోలు అందరూ క్యూ కడుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసినట్లయితే వారి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని హీరోలు అందరూ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ సుకుమార్ గురించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. సుకుమార్ బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లుగా ప్రచారాలు సాగుతున్నాయి.


వీరిద్దరి కాంబినేషన్లో సినిమా తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక రకాల పోస్టులు దర్శనమిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి సుకుమార్ ఏదో ఒక అధికారిక ప్రకటన ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు. ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కనుక వచ్చినట్లయితే సుకుమార్ బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా రాణిస్తారని వార్తలు వస్తున్నాయి.


ఈ విషయంపైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సుకుమార్ తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో కలిసి తీయాలని నిర్ణయం తీసుకున్నారట. వీరిద్దరి కాంబినేషన్లో పుష్ప-3 సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నట్లుగా సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: