
ఈ సినిమా మే, 9వ తేదీన రిలీజ్ కానుంది. ఆ సినిమా తర్వాత చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా కథను పూర్తి చేసుకుని అనిల్ రావిపూడి సిద్ధంగా ఉన్నారు. చిరంజీవికి సమయం దొరికినప్పుడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా.... చిరంజీవి తాజాగా తన అభిమానులకు ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి లండన్ టూర్ ను కొంతమంది వారికి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చిరంజీవి అన్నారు. ఫ్యాన్ మీట్ పేరుతో నన్ను కలిసి అవకాశం కల్పిస్తామంటూ కొంతమంది అభిమానుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఫ్యాన్ మీట్ పేరుతో ఇలా డబ్బులు వసూలు చేయడాన్ని నేను అస్సలు ఒప్పుకోనంటూ చిరంజీవి అన్నారు.
నన్ను కలవడానికి డబ్బులు వసూలు చేసిన అభిమానులకు తిరిగి వారి డబ్బులను ఇచ్చేయాలని కోరారు. నన్ను కలవడానికి ఎవరికీ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదంటూ చిరంజీవి, అభిమానులకు సూచనలు చేశారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా, మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.