నితిన్ హీరోగా తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. అది దా సర్ప్రైజ్ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే ఈ సాంగ్ కాంట్రవర్శీ గురించి నితిన్ తాజాగా రియాక్ట్ కాగా ఆయన చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. ఆ సాంగ్ లో నేను లేనని సాంగ్ రిలీజ్ చేశాక చాలామంది ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రియాక్షన్స్ వచ్చాయని నితిన్ కామెంట్లు చేశారు.
 
సినిమాలోని డ్యాన్స్ స్టెప్స్ విషయంలో కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేశారని నితిన్ పేర్కొన్నారు. మేము అందరి అభిప్రాయాలను గౌరవిస్తున్నామని ఇది ఎక్కడ ముగుస్తుందో నాకు తెలియదని నితిన్ చెప్పుకొచ్చారు. అంతా మంచే జరగాలని నేను కోరుకుంటున్నానని నితిన్ అన్నారు. నేను షూట్ లో లేనని సినిమా చూశానని సినిమా బాగా వచ్చిందనే ఆనందంలో అలా చేస్తూ వచ్చానని నితిన్ తెలిపారు.
 
సాంగ్ గురించి నేను పెద్దగా పట్టించుకోలేదని ట్రోల్స్ చూసిన తర్వాత నాకు కూడా ఆ పాటలోని స్టెప్ అర్థమైందని నితిన్ వెల్లడించారు. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారనే సంగతి తెలిసిందే. రాబిన్ హుడ్ సినిమాను చూశానని ఈ సినిమా బాగా వచ్చిందని అనిపించిందని నితిన్ వెల్లడించడం గమనార్హం. భీష్మ తర్వాత నితిన్ వెంకీ కుడుముల అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారేమో చూడాల్సి ఉంది.
 
రాబిన్ హుడ్ సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలోనే జరిగింది. వెంకీ కుడుములకు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో కీలకమని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మరికొన్ని గంటల్లో రాబిన్ హుడ్ ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. రాబిన్ హుడ్ సినిమా కమర్శియల్ గా ఏ రేంజ్ కు చేరుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: