
అలాగే తన నియోజకవర్గ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు .. తరచూ తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను పరిష్కారం చూపిస్తారు .. ఇక ప్రతిపక్షంలో కూడా అసెంబ్లీకి వెళ్లి తన పాత్ర పోషించిన బాలయ్య .. ఇప్పుడు తిరుగులేని మెజారిటీ ఉందని కాస్త వెనక్కి తగ్గుతున్నారా ? అనే చర్చ కూడా నడుస్తుంది .. దాదాపు 15 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య ఒక్కరోజు కూడా కనిపించకపోవడం ఇక్కడ విడ్డూరం .. ఎప్పుడు కూడా బాలయ్య ఇలా అసెంబ్లీకి రాని పరిస్థితి లేదన్నారు .. మొదటిసారిగా ఆయన ఒక సెషన్ మొత్తం రాలేదని అంటున్నారు .. అయితే బాలయ్య ఇలా ఎందుకు చేశారంటూ టిడిపి కార్యకర్తలోను హిందూపురం నియోజకవర్గంలోని గట్టి చర్చ నడుస్తుంది .
అయితే వ్యక్తిత్వంగాను సరదా మనిషిగా బాలయ్యకు మంచి పేరు ఉంది .. చిన్నపిల్లడి మనస్తత్వం అని కూడా అంటారు .. అలాంటి బాలయ్య ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ ఆటల పోటీల్లో పాల్గొనగ పోవడం ఎంతో లోటుగా కనిపిస్తుందని కూడా అంటున్నారు .. ఎప్పుడు లేని విధంగా ఎంతో ఆహ్లాదకరంగా సాగిన ఈ పోటీల్లో ఎమ్మెల్యేలు వివిధ పోటీల్లో పాల్గొని ఎంతో ఆనందపరిచారు .. అలాగే సంస్కృతిక కార్యక్రమాల్లో కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామా , మంత్రి కందుల దుర్గేష్ వంటి వారు ఎంతో హూందగా రాణించారు .. అయితే స్వతహాగా నటైన బాలయ్య వస్తే అది అందరికన్నా తన నట విశ్వరూపంతో అందర్నీ ఆకట్టుకునే వారిని కూడా అంటున్నారు .. అయితే ఈసారి బాలయ్య అసెంబ్లీ బడ్జెట్ సెషన్ మొత్తానికి రాకపోవడంతో ఈ పోటీలు బాగా మిస్ అయ్యారు .
అయితే అసెంబ్లీకి రాకపోవడానికి ప్రధాన కారణం బాలయ్య అఖండ 2 సినిమా అంటూ మరో ప్రచారం కూడా జరుగుతుంది .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 షూటింగ్ ప్రస్తుతం ఎంతో స్పీడ్ గా జరుగుతుంది .. ఇక ఈ షూటింగ్ పనిపై ముందుగా షెడ్యూల్ నిర్ణయించడంతో బాలయ్య అసెంబ్లీకి ఎమ్మెల్యే ఆటల పోటీలకు హాజరు కాలేకపోయారని కూడా అంటున్నారు .. ప్రజెంట్ హిమాలయాల్లో ఉన్న బాలయ్య ఈ సినిమా నిరవధిక షెడ్యూల్ తో ఖాళీ లేకుండా సినిమాలో నటిస్తున్నారు . దీని కారణంగానే తన పొలిటికల్ కెరీర్ లో మొదటిసారిగా అసెంబ్లీకి వెళ్లకుండా నిమగ్నమయ్యారని అంటున్నారు .