ప్రస్తుతం బాలీవుడ్లో ఇటీవలే కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అమీర్ ఖాన్, గౌరీ డేటింగ్ల వ్యవహారమే వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతుందనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. ఇలాంటి సమయంలోనే బాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ స్టార్ నటుడు 79 ఏళ్ల వయసులో నాలుగవసారి వివాహం చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నది. అది కూడా 29 ఏళ్ల నటిని వివాహం చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇక నటుడు ఎవరో కాదు కబీర్ బేడి.


హిందీ తో పాటు పలు తెలుగు చిత్రాలలో నటించిన ఈయన.. తెలుగులో సమంత శాకుంతల, గౌతమి పుత్ర శాత పుత్రకర్ణ తదితర చిత్రాలలో కూడా నటించారట. అయితే ఇప్పటికే నాలుగు సార్లు పెళ్లి చేసుకున్న కబీర్ బేడి మొదటి వివాహం 1969 లో జరిగింది. అది కూడా నత్తకి ప్రోతిమా వేడిత వివాహం జరగగా వీరికి పూజా బేరి, సిద్ధార్థ్ అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. తన మొదటి భార్యకు విడాకులు అనంతరం మళ్లీ కబీర్ బ్రిటిష్ ఫ్యాషన్ డిజైనర్ అయిన సుసాన్ రెండో వివాహం చేసుకున్నారు.. ఈ   బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు.


ఆ వెంటనే రేడియో ప్రొజెక్టర్ నిక్కి నీ మూడవ పెళ్ళి చేసుకున్నారు కబీర్. కానీ ఈ వివాహం కూడా ఎక్కువ కాలం నిలవలేకపోయింది చివరిగా 2005లో విడాకులు తీసుకున్న వీరు.. మళ్లీ ఇప్పుడు 79 సంవత్సరాల వయసులో ప్రేమలో పడి నాలుగవ వివాహాన్ని చేసుకున్నారు. అదికూడా భారతీయ సంతతికి చెందినటువంటి బ్రిటీష్ నటి పర్వీన్ దూసాంజ్ నాలుగవ వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ గత మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసి పలువురు నేటిజన్స్ ఆశ్చర్యపోయి.. కూతురు వయసు ఉన్న అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటారు ఈ వయసులో పెళ్లి అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ జంట వివాహానికి సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అలాగే కూతురు పూజ పేరు మీద ఉన్న హౌస్ లో వీరిద్దరి జంటగా కలిసి ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: