ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ సంచలనం అవుతున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ వల్ల రాష్ట్రంలో 25 మంది చనిపోయారని తెలుస్తోంది. నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తి ఈ యాప్స్ వల్ల ఏకంగా 80 లక్షల రూపాయలు నష్టపోయారని సమాచారం అందుతోంది. బెట్టింగ్ యాప్స్ తో ప్రమోషన్స్ చేస్తే ఎంత రెమ్యునరేషన్ దక్కుతుందనే ప్రశ్నలకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
 
బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి నిమిషం వీడియో చేస్తే 90,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ గా దక్కుతుందని తెలుస్తోంది. నిమిషానికి దాదాపుగా లక్ష రూపాయల సంపాదన అంటే సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. మిలియన్ ఫాలోవర్లు ఉన్న యూట్యూబర్లు నెలకు 30 లక్షల రూపాయల రేంజ్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం తీసుకుంటున్నారని భోగట్టా.
 
ఇన్ స్టాగ్రామ్ లో 5,000 మంది ఫాలోవర్లు ఉన్నవాళ్లకు సైతం నెలకు 20,000 రూపాయలు ఆఫర్ చేశారని సమాచారం అందుతోంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో పలువురు ప్రముఖ నటులపై ఆరోపణలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పారని నా అన్వేషణ అన్వేష్ చెబుతుండగా బ్యాంకాక్ పిల్ల తనకు 70 లక్షలు ఇస్తామని చెప్పారని చెప్పుకొచ్చారు.
 
బెట్టింగ్ యాప్స్ ముసుగులో ప్రముఖ యూట్యుబర్లు ఊహించని స్థాయిలో ఫ్రాడ్లు చేస్తున్నారని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ ను పూర్తిస్థాయిలో బ్యాన్ చేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ కు భవిష్యత్తులో అయినా యూట్యూబర్లు ప్రచారం చేయకుండా ఉంటారేమో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ వివాదాల వల్ల కొంతమంది కెరీర్లు ప్రమాదంలొ పదే అవకాశాలు అయితే ఉన్నాయని కచ్చితంగా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: