రాజమౌళి స్కూల్ ఎంతటి అగ్ర హీరో అయినా .. ఆ స్కూల్ తాలూకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిందే .. రాజమౌళిని నమ్మి సినిమాను ఓకే చేస్తే ఎలాంటి సినిమా వస్తుందో హీరోలకు తెలుసు .  అందుకే వాళ్ళు ఎవరు రాజమౌళికి ఎక్కడ ఎదురు చెప్పరు .. ఆఖరికి సూపర్ స్టార్ మహేష్ అయినా సరే . ఇప్పటికే రాజమౌళి , మహేష్  సినిమా షూటింగ్ మొదలుపెట్టే ముందు చాలా రకాలుగా మాటలు వచ్చాయి.   మహేష్ పూర్తిగా రాజమౌళికి సరెండర్ అవ్వాల్సిందే అని రాజమౌళి చెప్పినట్టు చేయాల్సిందని అంతా అన్నారు .. అంతేకాకుండా మహేష్ కు రాజమౌళి కొన్ని కండిషన్లు పెట్టాడని మహేష్ ఈ సినిమా పూర్తియ్యే వరకు తన లుక్ బయటకు చూపించకూడదనేది ప్రధాన షరతు అని ..


దీనికోసం పలు అడ్వర్టైజ్మెంట్లకు కూడా దూరంగా ఉండాలని .  అలాగే ఫ్యామిలీతో పాటు కలిసి ఫ్యామిలీ టూర్లకు కూడా వెళ్లకూడదన్న ఆంక్షలు ఉన్నాయని కూడా అంతా అన్నారు.   అయితే వందల కోట్లతో చూస్తున్న సినిమా ఇది మహేష్ లుక్ బయటకు వస్తే .. ఆ స‌ర్‌ప్రైజ్ పోతుంది కాబట్టి రాజమౌళి కండిషన్ కి ఎవరు తప్పు పట్టరు .. ఇక దాంతో మహేష్ కూడా అడ్వర్టైజ్మెంట్లు చేయడు .. బయట అసలు కనిపించడం అని అంతా అనుకున్నారు . అయితే ఇప్పుడు తీరా చూస్తే మహేష్ యాడ్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చేసింది .. ఇక అందులో రాజమౌళి సినిమా లుక్ లోనే ఆయన కనిపించాడు .. అలాగే మరికొద్ది రోజుల్లో సమ్మర్ వెకేషన్ అంటూ ఎప్పటి ల‌నే ఫారెన్‌ టూర్ వేసిన‌ ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు ..


 అంటే ఇక్కడ రాజమౌళి రూల్స్ మహేష్ దగ్గర పని చేయు అని అర్థం చేసుకోవాలి .. లేకుంటే మహేష్ కి రాజమౌళి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడా అని కూడా అర్థం చేసుకోవాలి . ఇక గుంటూరు కారం తర్వాత రాజమౌళి సినిమా కోసం దాదాపు యాడాది పాటు ఖాళీగా ఉన్నాడు మహేష్ .  2025లో మహేష్ సినిమా వచ్చే అవకాశం లేదు .. ఇందులో కనీసం అడ్వర్టైజ్మెంట్లో అయినా మహేష్ ను చూసి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అంటూ అభిమానులు అనుకున్నారు .. అయితే ఇప్పుడు 2026 లో ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలన్నది రాజమౌళి ప్లాన్ .. అలాగే ప్రీ ప్రొడక్షన్ పై కూడా ఇప్పటికే ఫోకస్ పెట్టాడు జక్కన్న .. షూటింగ్ కూడా ఎంతో స్పీడుగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: