కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన కామెడీ టైమింగ్ తో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక బలగం సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన వేణు తన దర్శకత్వంతో ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన బలగం సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.


ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించగా, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా చేసింది. ఈ సినిమా అనంతరం ప్రియదర్శికి, కావ్య కళ్యాణ్ రామ్ కి సినిమా అవకాశాలు వచ్చాయి. ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న వేణు తన తదుపరి సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇప్పటికే సినిమా కథను సిద్ధం చేసి రెడీగా ఉన్నారట వేణు. ఇక ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించగా, సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.



సినిమా కథకు సాయి పల్లవి బాగా సెట్ అవుతుందని వేణు భావించి సాయి పల్లవిని ఫిక్స్ చేశారట. కానీ సాయి పల్లవి డేట్స్ కుదరకపోవడంతో ఈ సినిమాలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ను ఎంపిక చేశారట. ఇప్పటికే ఈ సినిమా కథను సాయి పల్లవికి వినిపించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభించనున్నారట.

కాగా, ఇది వరకే కీర్తి సురేష్, నితిన్ కాంబినేషన్లో రిలీజ్ అయిన రంగ్ దే సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరోసారి ఈ సినిమా తీసినట్లైతే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని దర్శకుడు వేణు భావించి ఇందులో కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూజా కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: