తెలుగు, తమిళ భాషలలో పలు చిత్రాలలో వెబ్ సిరీస్లలో నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్.. అయితే హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తూ భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించడమే కాకుండా పలు చిత్రాలలో విలన్ గా కూడా నటించి అదరగొట్టేసింది. ఇటీవలే మదగజరాజా సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. గత ఏడాది తను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక బంధంలో అటు సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్నది.


వరలక్ష్మి శరత్ కుమార్ అటు సినిమాలతో పాటు పలు రకాల టీవీ షోలకు కూడా జడ్జిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఇటీవలే ఒక తమిళ టీవీ షో కి హాజరైన వరలక్ష్మి శరత్ కుమార్ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ గా మాట్లాడింది. తన చిన్నతనం లో జరిగిన సంఘటనలు చేదు అనుభవాలను గుర్తు తెచ్చుకొని మరి ఎమోషనల్ గా మాట్లాడింది.ఈటీవీ షో లోనే ఒక లేడీ కంటెస్టెంట్ తన జీవితంలో జరిగిన కొన్ని వేధింపుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకోవడంతో ఇది చూసిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన చిన్నతనంలో జరిగిన వేధింపుల బాధలు బయటపెట్టింది.



నీది నాది ఒకటే కథ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. బాల్యంలో తనని అయిదారు మంది కలిసి వేధించే వారిని తెలియజేసింది.. తన చిన్నతనంలోనే చాలా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారంటూ ఎమోషనల్ గా మాట్లాడింది వరలక్ష్మి శరత్ కుమార్. అలా లేడీ కంటెస్టెంట్ తో మాట్లాడుతూ ఎమోషనల్ గా పలు విషయాలను పంచుకుంది. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.. ఒక స్టార్ నటుడు కూతురికి కూడా ఇలాంటి వేధింపులు కంటే ఆశ్చర్యంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: