సోషల్ మీడియా ఎవరిని ఏ విధంగా అయినా మార్చేస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ మార్ఫింగ్ అనే విషయం పక్కన పడితే సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ కారణంగా చాలామంది స్టార్స్ బయట మాట్లాడాలి అంటే భయపడిపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవిని ఏ విధంగా ట్రోల్ చేశారో జనాలు అందరికీ తెలిసిందే. " బ్రహ్మ ఆనందం " సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు చాలా చాలా హాట్ టాపిక్ గా వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా మెగా వారసుడి పై లేనిపోని డౌట్స్ క్రియేట్ అయ్యేలా చేశాయి .


అంతేకాదు ఆయన మాట్లాడిన వాళ్ళ తాతగారి గురించి నాటి కామెంట్స్ ని కూడా జనాలు ఓ రేంజ్ లో మండిపడేలా ఉన్నాయి.  అయితే ఈ ట్రోలింగ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి . కాగా రీసెంట్గా చిరంజీవి యూకే పర్యటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే . అక్కడ ఆయన ఫ్యాన్స్ తో జనాలతో ముచ్చటిస్తూ వచ్చారు. కాగా రీసెంట్గా ఆయన అక్కడ సరదాగా కాసేపు తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు . లైఫ్ లో మీరు గొప్ప స్థాయికి వెళ్తే నాకు సంతోషమని తెలిపారు.  అక్కడ ఉన్నవారందరినీ కూడా తమ్ముళ్లు సిస్టర్స్ అంటూ మాట్లాడారు.



అంతేకాదు చాలా చాలా హుందాగా ఈసారి ఎక్కడ టంగ్ స్లిప్ కాకుండా మాట్లాడారు . మరి ముఖ్యంగా చిరంజీవి ఏ ఈవెంట్లో ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాలా సరదా సరదాగా నాటి కామెంట్స్ చేసేవారు. ఒకటి రెండు పంచ్ లైన పేలేటివి.. కానీ ఈసారి మాత్రం చాలా చాలా జాగ్రత్త పడిపోయాడు . ఎక్కడ కూడా ఆయన పేరు పై ట్రోలింగ్ జరిగేలా చేసుకోకుండా..  చాలా చక్కగా తన స్థాయిని డబుల్ చేసుకునే విధంగా మాట్లాడారు . దీనితో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి పేరు మరొకసారి వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కారణంగా భయపడినట్లు ఉన్నాడు . అందుకే హద్దులు మీరకుండా అన్నీ లిమిట్స్ లోనే మాట్లాడారు.. అంటూ వ్యంగంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: