
సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిందే . నందమూరి బాలయ్య తో సినిమా అంటే ఓ రేంజ్ లో జనాలు ఊహించేసుకుంటూ ఉంటారు . అలాంటి బాలయ్య తన సినిమాల విషయంలో చాలా చాలా పక్కాగా క్లారిటీగా ముందుకు వెళుతూ ఉంటాడు . మరీ ముఖ్యంగా నందమూరి హీరో బాలయ్య తన సినిమాల డైరెక్టర్ల విషయంలో చాలా చాలా పక్కాగా ముందుకు వెళుతూ ఉంటాడు . ఇప్పుడు బాలయ్య కమిట్ అయిన డైరెక్టర్ పేరు వింటే పూనకాలు వచ్చేస్తాయ్.
అలాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ . అసలు ఈ కాంబోలో ఒక సినిమా వస్తుంది అని నందమూరి ఫ్యాన్స్ కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటి కాంబో ఇది. ఆయన మరెవరో కాదు హరీష్ శంకర్ . టాలీవుడ్ ఇండస్ట్రిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ఫిలిం వర్గాలలో టాక్ వినిపిస్తుంది . హరీష్ సినిమాలకు ఒక ప్రత్యేక స్టైల్ ఉంటుంది . బాలయ్య చిత్రాలు వేరే స్టైల్ లో ఉంటాయి . ఇద్దరిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్.
మరి ఇద్దరి కాంబోలో సినిమా అంటే మాత్రం కొంచెం ప్లస్ కొంచెం నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి సినిమాను తెరకెక్కించిన హరీష్ శంకర్ - బాలయ్యతో సినిమాకి కమిట్ అయ్యాడు అంటే మాత్రం అది ఒక సెన్సేషనల్ అనే చెప్పాలి . ప్రెసెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళ కాంబో గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు జనాలు . అయితే వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది ఏ జోణర్ లో తెరకెక్కబోతుంది అన్న డీటెయిల్స్ తెలియాలి . నందమూరి ఫ్యాన్స్ దీనిపై ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!