దాదాపు రెండు సంవత్సరాల క్రితం మ్యాడ్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ పై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. అలాంటి సమయం లోనే ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దానితో ఈ మూవీ పై పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అలా ఈ మూవీ పై పెద్ద స్థాయిలో అంచనాలు లేకపోవడంతో ఈ మూవీ కి కి ఓవరాల్ గా 2.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

అలా తక్కువ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకోవడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే మూవీ ని రూపొందించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే మ్యాడ్ స్క్వేర్ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే మ్యాడ్ స్క్వేర్ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

దానితో ఈ మూవీ కి అత్యంత భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మ్యాడ్ మూవీ.కి మొత్తంగా 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... మ్యాడ్ స్క్వేర్ మూవీ కి కేవలం నైజాం ఏరియాలో 6.50 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా మ్యాడ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో మ్యాడ్ స్క్వేర్ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకొని , ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: