బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఫస్ట్ వైఫ్ అంటే అందరూ అలియా భట్ అని అనుకుంటారు. కానీ అలియా భట్ ఫస్ట్ వైఫ్ కాదు అంటూ రణబీర్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్లు చేశారు. మరి ఇంతకీ రణబీర్ కపూర్ మొదటి భార్య ఎవరు.. ఆమెను కలవాలని మళ్లీ ఎందుకు ట్రై చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ని బాలీవుడ్ లో ప్లే బాయ్ అని అంటూ ఉంటారు.ఇప్పటికే ఈయన ఎంతోమంది హీరోయిన్లతో డేటింగ్ చేశారు. ఈయన డేటింగ్ చేసిన కొంతమంది హీరోయిన్లతో పెళ్లి వరకు వెళ్లారు. కాని చివరికి అలియా భట్ కి భర్త అయ్యారు.అయితే అలియా భట్ కంటే ముందే ఓ అమ్మాయి రన్బీర్ కపూర్ ని పెళ్లి చేసుకుందట. అది కూడా ఆయన ఇంటికెళ్ళి..  వింటుంటే కాస్త విచిత్రంగానే ఉన్నప్పటికీ ఇది నిజమే అంటూ రణబీర్ కపూర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. 

రణబీర్ కపూర్ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఎంతోమంది మహిళా అభిమానులు ఉన్నారు.కానీ ఈ అమ్మాయి మాత్రం నాకు వీరాభిమాని కావచ్చు. ఎందుకంటే నేను ఓ రోజు ఊర్లో లేని సమయంలో మా ఇంటి గేటు దగ్గరికి వచ్చి మా వాచ్మెన్ చూస్తుండగానే ఓ పూజారిని పట్టుకొచ్చి మా ఇంటి గేటుతో వివాహం చేసుకొని రణబీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్నాను అనే ఫీలింగ్ లో అక్కడినుండి వెళ్ళిపోయిందట.అయితే ఆ తర్వాత నేను ఊరికి వచ్చాక చూస్తే గేటుకు పూజ చేసి బొట్లు పెట్టి పువ్వులు పెట్టి ఉన్నాయి. ఇదేంటి ఇలా ఉంది అని వాచ్మెన్ ని అడగగా ఓ అమ్మాయి పూజారిని తీసుకువచ్చి ఇలా మీ ఇంటి గేట్ తో వివాహం చేసుకొని రణబీర్ కపూర్ తో నాకు పెళ్లయిపోయింది అన్నట్టుగా ఫీల్ అయి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది సార్ అని చెప్పారు.

అయితే ఆ అమ్మాయిని నేను ఇప్పటి వరకైతే కలవలేదు.కానీ ఎప్పటికైనా ఆ అమ్మాయిని కలవాలనేదే నా కోరిక. ఇక గేటుని పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఈ విషయం తెలియడంతో నేను ఆశ్చర్యం లో మునిగిపోయాను.కానీ ఎప్పటికైనా ఆ అమ్మాయిని కలవాలి. ఆ అమ్మాయే నా మొదటి భార్య అంటూ కాస్త సరదాగా చెప్పుకొచ్చారు రణబీర్..ప్రస్తుతం రణబీర్ కపూర్ చెప్పిన మాటలు మీడియాలో వైరల్  అవ్వడంతో చాలామంది నెటిజన్లు రణబీర్ కపూర్ మొదటి భార్య అలియా భట్ కాదా.. ఆ అమ్మాయి ఏనా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక రణబీర్ కపూర్ కి మాత్రమే కాదు ఎంతో మంది హీరోలకు ఇలాంటి ఫన్నీ అనుభవాలు ఎదురయ్యాయి

మరింత సమాచారం తెలుసుకోండి: