
అయితే ఈ చిత్రానికి సంబంధించి సీక్వెల్ పైన ఎన్నో ఏళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి తాజాగా ఇప్పుడు డైరెక్టర్ మురగదాస్ అడుగులు వేసినట్ల ఆయన స్వయంగా తెలియజేశారు. వరుస డిజాస్టర్లతో ఇబ్బంది పడుతున్న మురుగదాస్ హిందీ మూవీ సికిందర్ తో కమ్ బ్యాక్ ఇవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సినిమాకి పనిచేస్తున్న సమయంలోనే ముంబైలో మురుగదాస్ హీరో అమీర్ ఖాన్ ని కలిసినట్లు తెలియజేశారు. అప్పుడే గజిని 2 సినిమా గురించి డిస్కషన్ జరిగాయని తెలిపారు.
ప్రస్తుతం మురగదాస్ సికిందర్.. అలాగే హీరో అమీర్ ఖాన్ సితారే జమీర్ పర్ వంటి చిత్రాలలో బిజీగా ఉన్నారని.. ఇవి రెండు అయిపోయిన వెంటనే మళ్ళీ ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటామని అప్పుడే గజిని 2 సినిమా విషయాల పైన డిస్కషన్ చేసుకుంటామంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. మొత్తానికి డైరెక్టర్ మురగదాస్ గజిని 2 సినిమా బీజం వేయాలి అంటే సికిందర్ సినిమా బాగా ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే డైరెక్టర్ మురగదాస్ ట్రాక్స్ సైతం చాలా దెబ్బతినిందని ఇలాంటి సమయంలోనే సికిందర్ సినిమా ఆడకపోతే అటు డైరెక్టర్ కి ఇటు హీరో అమీర్ ఖాన్ కి కూడా ఇబ్బంది అని చెప్పవచ్చు.