
'నేను జబల్ పూర్ నుండి వచ్చాను. సినిమాలలో నటించడం అంటే నాకు చాలా ఇష్టం. నా కాలను నెరవేర్చుకోవడం కోసం నేను కుటుంబాన్ని సైతం వదిలేసి వచ్చాను. మొదట ఫేస్ బుక్ లో నా ఫోటోస్ చూసి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా నాకు అర్జున్ రెడ్డి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమాలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాను. అయితే నేను సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా ఏళ్లు అయ్యింది. ఇన్ని ఏళ్లల్లో నాకు దర్శక-నిర్మాతలు, నటీనటులు ఎంత సప్పోర్ట్ ఇచ్చారు. అలాగే ఈ ప్రయాణంలో చాలా సార్లు సవాళ్లను కూడా ఎదురుకున్నాను. నేను ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు.. దర్శకుడి వల్ల ఇబ్బంది పడ్డాను. కారవాన్ లో నేను దుస్తులు మార్చుకునే సమయంలో నా పర్మిషన్ లేకుండా దర్శకుడు డోర్ తీశాడు. నాకు చాలా కోపం వచ్చి వెంటనే కేకలు వేశాను. దాంతో ఆయన అక్కడినుండి వెళ్ళిపోయాడు. చుట్టూ ఉన్న వాళ్లలో కొందరు అలా చేయకుండా ఉండాల్సింది అని అన్నారు. కానీ నాకు నేను చేసిన పని ఏ మాత్రం తప్పుగా అనిపించలేదు' అని షాలిని పాండే చెప్పారు. షాలిని పాండే ఇటీవలే డబ్బా కార్టెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ప్లీక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.