టాలీవుడ్ టైర్ 2 హీరోలు నటించిన సినిమాల టీజర్లలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 మూవీ టీజర్స్ ఏవో తెలుసుకుందాం.

హిట్ ది థర్డ్ కేస్ : నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు స్టైలిష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ మరి కొంత కాలంలోనే విడుదల కానుంది. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను ఈ మూవీ బృందం వారు విడుదల చేయగా ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 17.12 వ్యూస్ వచ్చాయి. దానితో ఈ మూవీ టీజర్ టైర్ 2 హీరోలలో 24 గంటలు అత్యధిక వ్యూస్ ను సాధించిన టీజర్లలో మొదటి స్థానంలో నిలిచింది.

అర్జున్ S/O వైజయంతి : కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 12.20 మిలియన్ వ్యూస్ దక్కాయి. దానితో ఈ మూవీ టీజర్ రెండవ స్థానంలో కొనసాగుతుంది.

కింగ్డమ్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఈ మూవీ కి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ టీజర్ కు 24 గంటల్లో 11.88 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దానితో ఈ మూవీ టీజర్ మూడవ స్థానంలో కొనసాగుతుంది.

అంటే సుందరానికి : నాని హీరో గా రూపొందిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టీజర్ కు విడుదల అయిన 24 గంటల్లో 10.36 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దానితో ఈ మూవీ టీజర్ నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.

ది ఫ్యామిలీ స్టార్ : విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటించింది. పరశురామ్ పేట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ టీజర్ కు విడుదల 24 గంటల్లో 9.82 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దానితో ఈ మూవీ టీజర్ ఐదవ స్థానంలో కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: