రీజన్ ఏంటో తెలియదు కానీ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పై సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది . మరి ముఖ్యంగా ఆమె బ్యాక్ టు బ్యాక్ మూడు బడా హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న సరే ఆమె పేరు పై అరాకొరా నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూనే వస్తున్నాయి . మరీ ముఖ్యంగా "ఛావా" సినిమా అంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ రష్మిక మందన్నా డబ్బింగ్ బాగోలేదు అని .. రష్మిక మందన్నా ఎక్స్ప్రెషన్స్ బాగోలేవు అని అసలు సినిమా హిట్ అవ్వడానికి కారణం అంత విక్కి కౌశల్ అంటూ తెగ పొగిడేశారు బాలీవుడ్ జనాలు .


అంతేకాదు రష్మిక మందన్నా  ఈ రోల్ కి అన్ఫిట్ అంటూ కూడా ట్రోల్ చేశారు . ఎవరు ఎన్ని ట్రోలింగ్ చేస్తున్న రష్మిక మందన్నా.. తన పని తాను చేసుకుంటూ పోయింది . ఫైనల్లీ సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.  కాగా ప్రెసెంట్ రష్మిక మందన్నా బాలీవుడ్ - తెలుగు - హాలీవుడ్ సినిమాలలో బిజీగా ఉంది . అయితే ఇదే మూమెంట్ లో ఆమె పై మరొకసారి ట్రోలింగ్ జరుగుతుంది . రీసెంట్ గానే రష్మిక మందన్నాకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్  సంపాదించుకున్న ఏకైక హీరోయిన్ రష్మిక  అని ఇప్పుడు ఏ పాన్ ఇండియా ప్రాజెక్టులో హీరోయిన్గా మొదట అనుకున్నా అందరూ రష్మిక మందన్నా నే అని అనుకుంటున్నారు అని జనాలు మాట్లాడుకుంటూ వచ్చారు.



అయితే ఆమె ఫేస్ కి అంత సీన్ లేదు అని .. డైరెక్టర్ హీరోస్ లక్ కారణంగా సినిమాలు హిట్ అయ్యాయే తప్పిస్తే రష్మిక పర్ఫామెన్స్ పెద్దగా చెప్పుకోతగ్గ రేంజ్ లో లేదు అని అసలు ఆమెను పక్కాగా గమనిస్తే తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న ఆ ఇద్దరి హీరోల నటనతో కంపేర్ చేస్తే రష్మిక మందన్నా వాళ్ల కాలి గోటికి కూడా సరిపోదు అని చిన్నచిన్న సినిమాలలో నటిస్తూనే ఆ హీరోలు పెద్ద స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారని .. ఓ రేంజ్ లో ఆమె ని ట్రోల్ చేస్తున్నారు . నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను టైర్ 2 హీరోలతో కంపేర్ చేయడం నిజంగా ఘోర అవమానమని అంటున్నారు రష్మిక ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: