ఒకప్పుడు సినిమాలు తెరకెక్కించాలి అంటే డైరెక్టర్లకి కేవలం కథ బాగుండి.. హీరో హీరోయిన్లు దొరికితే చాలు అనిపించేది.  కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు . టోటల్గా మారిపోయింది ఎలా అంటే . ఇప్పుడు డైరెక్టర్లు ఒక హీరోతో సినిమా తెరకెక్కించాలి అంటే ఫ్యాన్ బేస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ హీరోకి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంది .. ఆ హీరో తో సినిమాకి కమిట్ అయితే ట్రోలింగ్ జరుగుతుందా..? ట్రెండ్ అవుతామా ..? ఆ హీరోతో రిస్కీ షాట్స్ తీస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారా..? ఇలా ముందు ఫాన్స్ గురించి ఆలోచించి ఆ తర్వాత సినిమా కథ గురించి ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది.


మరీ ముఖ్యంగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ - రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంత వేడి మీద ఉన్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇద్దరి మధ్య జరిగే వార్ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వివాదాలు అందరికీ తెలిసినవే . కాగా ఇప్పుడు బడా బడా స్టార్ డైరెక్టర్ లు అటు రామ్ చరణ్ తో ఇటు బన్నీతో సినిమాని తెరకెక్కించాలి అంటే భయపడిపోతున్నారు . సుకుమార్ - బన్నీతీ సినిమా తెరకెక్కించాడు.  ఇప్పుడు అదే సుకుమార్ - రామ్ చరణ్ తో తెరకెక్కిస్తే ఖచ్చితంగా బన్నీ ఫ్యాన్స్.. రామ్ చరణ్ సినిమాని ట్రోల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి .



అంతేకాదు ఇప్పుడు సుకుమార్ లాంటి పరిస్థితి మిగతా డైరెక్టర్ లు కూడా ఫేస్ చేయాల్సిన సిచువేషన్ వచ్చేసింది . బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ చరణ్ తో సినిమా అంటూ ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత విపరీతంగా టాక్ వినిపించింది . కానీ అది ఎక్కడా కూడా కార్యరూపం దాల్చుకోలేదు . ఇప్పుడు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ - సంజయ్ లీలా భన్సాలి అంటూ టాక్ వినిపిస్తుంది . ఇది మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయిపోయినట్లే అని తెలుస్తుంది . ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్.. ఈ ప్రాజెక్టును ఓకే చేయగలరా..?  అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ . కేవలం ఇదే కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ - లోకేష్ కనగరాజ్ - నెల్సన్ వీళ్ళందరూ కూడా చరణ్ తో సినిమా అంటూ చాలా టాక్ వినిపించింది.  కానీ ఇప్పుడు మొత్తం కూడా ట్రెండ్ మారిపోయింది. బన్నీ చుట్టూ ఈ డైరెక్టర్స్ తిరుగుతున్నారు.  దీంతో ఇప్పుడు ఈ డైరెక్టర్స్ కి కొంత టెన్షన్ పట్టుకుంది . కచ్చితంగా అల్లు అర్జున్ సినిమా తర్వాత రాంచరణ్ తో సినిమా ఉండనే ఉంటుంది.  అప్పుడు పరిస్థితి ఎలా మారిపోతుందో..? జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో..? అనే టెన్షన్ ఈ డైరెక్టర్స్ కి బిగ్ హెడేక్గా మారిపోయింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: