
టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలలో ఈ బుడ్డోడు నటించాడు. అతనే చైల్డ్ ఆర్టిస్ట్ భారత్. భారత్ ఎన్నో సినిమాలలో నటించి హిట్ కొట్టాడు. ఇతను తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవాడు. భారత్ నటించిన సినిమాలన్ని హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సినిమాలే. భారత్ రవితేజ నటించిన వెంకీ సినిమాలో, రామ్ నటించిన రెడీ సినిమాలో, నాగార్జున నటించిన కింగ్ సినిమాలలో నటించాడు. ఇవి మాత్రమే కాదు ప్రభాస్ తో మిస్టర్ పర్ఫెక్ట్ లో, పవన్ కల్యాణ్ తో గుడుంబా శంకర్ లో, మహేష్ బాబుతో పోకిరిలో, సునిల్ నటించిన అందాలరాముడు సినిమాలో సైతం నటించాడు.
భారత్ అప్పట్లో అందరూ స్టార్ హీరోలతో నటించాడు.. అలాగే అతను నటించిన సినిమాలు అన్ని హిట్ కొట్టిన సినిమాలే. ఈ బాలుడు దాదాపు 80కి పైగా సినిమాలలో నటించి అలరించాడు. తెలుగుతో పాటు తమిళం అలాగే ఇతర భాషలలో కూడా భారత్ నటించాడు. ఇతను చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. పెద్దగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండడు. మొన్న ఈ మధ్య యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన ABCD సినిమాలో సెకండ్ హీరోగా మెరిశాడు. చిన్నప్పుడు బొద్దుగా ఉన్న భారత్ ఇప్పుడు మాత్రం హీరోలకు పోటీగా నిలిచేలా ఉన్నాడు.