దర్శక ధీరుడు రాజమౌళి మొదట పెళ్లి చేసుకొని ఓ బాబు ఉన్న రమాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనం తెలిసిందే. రమాకి కార్తికేయ అనే కొడుకు ఉన్నాడు.ఇక కార్తికేయ కోసం రామా, రాజమౌళి మళ్లీ పిల్లల్ని కూడా కనలేదు.కార్తికేయనే సొంత కొడుకు అనుకున్న రాజమౌళి మయూఖా అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. అయితే తాజాగా రాజమౌళి దత్తత తీసుకున్న మయూఖ ఓ పెళ్లయిన హీరోని ప్రేమించింది అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఇంతకీ మయూఖ ఎవర్ని ప్రేమించింది. సోషల్ మీడియాలో వినిపించే వార్తలు నిజమేనా అనేది ఇప్పుడు చూద్దాం. రాజమౌళి కూతురు మయూఖ ప్రేమించింది ఎవరినో కాదు కియారా అద్వానీ భర్త సిద్ధార్థ్ మల్హోత్రా.అవును మీరు వినేది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి బయటపెట్టారు. 

ఇక రాజమౌళి కూతురు మయూఖకి సిద్ధార్థ్ మల్హోత్రాని కలిసి ఒకరోజు డేటింగ్ చేయాలి అనే కోరిక ఉండేదట.ఇక ఈ విషయాన్ని సిద్ధార్థ్ కి తెలియజేయగా ఆయన కూడా వీలు చూసుకుని ఓ రోజు ఇంటికి పిలిచారట.ఇక మయూఖ ఇంటికి వెళ్లడంతోనే ఎన్నో అతిధి మర్యాదలతో సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారట. ఆ తర్వాత డిన్నర్ చేశాక ఎన్నో విషయాలను ఇద్దరూ పంచుకున్నారట. ఇక రాజమౌళి కూతురు మయూఖకి సిద్ధార్థ్ చెప్పిన ఎన్నో ఆలోచనలు ఆమె మైండ్లో నిలిచిపోయాయట. అంతేకాదు సిద్ధార్థ్ మల్హోత్రాని కలిసి ఇంటికి వచ్చాక ఆయన ఎన్ని మంచి విషయాలు చెప్పారో రాజమౌళికి చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిందట.

ఒకరోజు సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి మాట్లాడడం ఎంతో హ్యాపీగా అనిపించింది అని నా కూతురు నాతో చెప్పిందని,మీరు నా కూతురికి ఇంత గొప్ప జ్ఞాపకాలు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అంటూ రాజమౌళి తన సోషల్ మీడియా ఖాతాలో సిద్ధార్థ్ మల్హోత్రాని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ కి స్పందించిన సిద్ధార్థ్ మల్హోత్రా మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం లేదు.నేను మీకు పెద్ద వీరాభిమానిని. మీ కూతురికి ఇండియా టాప్ డైరెక్టర్ కూతుర్ని అనే గర్వం పొగరు కొంచెం కూడా లేదు. ఆమె చాలా టాలెంటెడ్ పర్సన్. మీ కూతురు చాలా మంచిది. ఎంతో సింపుల్ గా ఉంటుంది. నేను త్వరలోనే మిమ్మల్ని కలుసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా కూడా స్పందించడంతో ఈ విషయం కాస్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.. అలా కియారా అద్వానీ ని సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లి చేసుకోవడంతో పెళ్లయిన సిద్ధార్థ్  మల్హోత్రాని రాజమౌళి కూతురు మయూఖ ప్రేమించింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: