ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన సంగీత దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో భీమ్స్ సిసిరొలియో ఒకరు. ఈయన ఇప్పటి వరకు కొన్ని సినిమాలకే సంగీతం అందించిన ఈయన సంగీతం అందించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు మంచి విజయాలను అందుకోవడం , ఆ సినిమాలలో ఈయన అందించిన సంగీతానికి కూడా మంచి ప్రశంసలు రావడంతో తక్కువ కాలం లోనే ఈయనకు అద్భుతమైన గుర్తింపు సంగీత దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో దక్కింది. తాజాగా ఈయన విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అలాగే ఈ మూవీ లోని సంగీతానికి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇకపోతే ప్రస్తుతం భీమ్స్ సెసిరోలియో చేతిలో రెండు అదిరిపోయే రేంజ్ క్రేజీ సినిమాలో ఉన్నాయి. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సాధిస్తే ఈ సంగీత దర్శకుడి క్రేజ్ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సంగీత దర్శకుడి చేతిలో ప్రస్తుతం ఉన్న ఆ రెండు క్రేజీ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరి కొంత కాలంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి బీమ్స్ సంగీత దర్శకుడిగా కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ఇక రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ మూవీ కన్ఫామ్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కూడా బీమ్స్ సంగీత దర్శకుడిగా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు మూవీలు మంచి విజయాలను సాధించినట్లయితే సంగీత దర్శకుడిగా బీమ్స్ కి క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో మరింత పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: