సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమాని ఎంత బాగా తీశాము అనే దాని కంటే కూడా ఎంత బాగా ప్రమోట్ చేశామో అనే దాని పైనే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటారు. ఎందుకు అంటే సినిమాను ఎంత గొప్పగా తీసినా కూడా దానిని జనాలకు తెలిసేలా పబ్లిసిటీ చేయనట్లయితే ఆ మూవీ థియేటర్లలోకి వచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియనట్లయితే ఆ మూవీ బాగున్న కూడా కలెక్షన్లు పెద్దగా రావు. దానితో మేకర్స్ ఈ మధ్య కాలంలో సినిమాను తీసిన దాని కంటే కూడా పబ్లిసిటీని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు.

దానితో మూవీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ లుక్ అంటూ ఒక పోస్టర్ను , ఆ తర్వాత గ్లిమ్స్ అంటూ ఓ వీడియోలను ,  ఆ తర్వాత టీజర్   , ట్రైలర్ , ఫస్ట్ సింగిల్ , సెకండ్ సింగిల్ అంటూ ఇలా అనేక రకాల ప్రచార చిత్రాలను విడుదల చేస్తూ సినిమాలపై అంచనాలను పెంచేస్తూ వస్తున్నారు. ఇకపోతే అద్భుతమైన క్రేజ్ కలిగిన ఒక సినిమా విషయంలో మాత్రం మేకర్స్ కాస్త ప్రత్యేకంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం మ్యాడ్ అనే మూవీ వచ్చి మంచి విజయం అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాని రూపొందించారు. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇకపోతే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయాలా ... వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండడంతో ప్రత్యేకంగా ట్రైలర్ ను విడుదల అవసరం లేదు అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , మరి ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: