టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో యువి క్రియేషన్స్ సంస్థ ఒకటి. ఈ సంస్థ వారు యువి క్రియేషన్స్ బ్యానర్ ను మొదలు పెట్టిన తర్వాత నిర్మించిన సినిమాలలో చాలా శాతం సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. దానితో తక్కువ సమయం లోనే ఈ బ్యానర్ కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈ బ్యానర్ వారు నిర్మించిన సినిమాలలో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్నాయి.

ప్రస్తుతం ఈ బ్యానర్ వారు మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర అనే భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యానర్ వారు ఓ క్రేజీ కాంబోలో మూవీ ని సెట్ చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి నితిన్ హీరో గా తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి క్రేజ్ ను కలిగి ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ వారు ఓ మూవీ ని నిర్మించడానికి ప్రయత్నాలను చేస్తున్నట్లు , ప్రస్తుతం ఈ కాంబో మూవీ కి సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు అన్ని ఓకే అయితే మరికొన్ని రోజుల్లోనే యువి క్రియేషన్స్ సంస్థ వారు నితిన్ , విక్రమ్ కాంబో మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇకపోతే గతంలో నితిన్ , విక్రమ్ కాంబోలో రూపొందిన ఇష్క్ మూవీ మంచి విజయం సాధించింది. దానితో ఈ కాంబోలో మూవీ కనుక సెట్ అయితే దానిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: