టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం ఈ నటుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

ఈయన చాలా కాలం క్రితమే కింగ్డమ్ మూవీని మొత్తం రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు కాకపోతే ఈ సినిమా యొక్క మొదటి భాగం షూటింగ్ పూర్తి సినిమా విడుదల అయ్యాక రెండవ భాగం షూటింగ్ను మొదలు పెడతాము అని చెప్పుకొచ్చాడు. నాగ వంశీ కొంత కాలం క్రితం మ్యాడ్ అనే మూవీని నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దానితో ఈ సినిమాకు కొనసాగింపుగా నాగ వంశీ "మ్యాడ్ స్క్వేర్" అనే సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నాగ వంశీ ఈ సినిమా ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన కింగ్డమ్ మూవీ గురించి మాట్లాడుతూ ... కింగ్డమ్ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నాం. ఇకపోతే కింగ్డమ్ మూవీ మొదటి భాగం విడుదల అయిన తర్వాత ఆ సినిమాకు కింగ్డమ్ పార్ట్ 2 అనే టైటిల్ పెట్టాలా లేక కింగ్డమ్ స్క్వేర్ అనే టైటిల్ పెట్టాలా అనేది ఆలోచిస్తాం అని నాగ వంశీ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే నాగ వంశీ కొంత కాలం క్రితం సిద్దు జొన్నలగడ్డ హీరోగా డీజే టిల్లు అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆ మూవీ కి కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో మూవీ ని రూపొందించాడు. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక టిల్లు స్క్వేర్ మూవీ సెంటిమెంట్ ను నాగ వంశీ "కింగ్డమ్" మూవీ విషయంలో కూడా ఫాలో అయ్యేలా ఉన్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: